టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కడ విన్నా ‘అఖండ’ ప్రీ రిలీజ్ గురించే ముచ్చట.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న మూడో చిత్రం కావడంతో ప్రేక్షకులు భారీగానే అంచనాలను పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టే సినిమా ట్రైలర్, సాంగ్స్ కూడా ఉండడంతో డిసెంబర్ 2న ఈ సినిమాకు ఢోకా లేదని నందమూరి ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. ఇక తాజాగా మేకర్స్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
నవంబర్ 27 న శిల్పకళావేదికలో ‘అఖండ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగనుంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వస్తున్నాడని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. బాలయ్య- బన్నీ ఒకే స్టేజీపై కనిపించనున్నారన్న ఆనందంతో ఉన్న నందమూరి ఫ్యాన్స్ కి మేకర్స్ మరో సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ వేడుకలో దర్శక ధీరుడు రాజమౌళి కూడా సందడి చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక దీంతో ఈ వేడుక ఇంకా ఆసక్తికరంగా మారనుంది. స్పెషల్ గెస్ట్ గా రాజమౌళి హాజరుకానున్నట్లు మేకర్స్ తెలిపారు. మరి ఈ వేడుకలో రాజమౌళి, బాలయ్య, బన్నీల స్పీచ్ ఎలా ఉండబోతున్నాయో చూడాలంటే రేపటి వరకు ఆగాల్సిందే