SS Rajamouli: ఎవరూ ఊహించని హీరోతో దర్శకధీరుడు రాజమౌళి కొత్త సినిమా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SS Rajamouli: తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన దర్శకధీరుడు రాజమౌళి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిని దాటి పాన్ వరల్డ్ స్థాయికి తెలుగు సినిమాను తీసుకెళ్లిన ఘనత ఆయనదే. ప్రస్తుతం జక్కన్న సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘వారణాసి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అనుకున్న టైంకి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని జక్కన్న పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఆయన వారణాసి తర్వాత ఏ హీరోతో సినిమా చేయబోతున్నారనే చర్చ ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలో ఆసక్తిగా మారింది. గతంలో రాజమౌళి తర్వాత సినిమా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ఉండబోతుందని జోరుగా ప్రచారం జరిగింది. అయితే దీనిపై అల్లు అర్జున్ కానీ, రాజమౌళి టీం కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు.
అయితే ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సౌత్ స్టార్ హీరో సూర్య కాంబినేషన్లో సినిమా రాబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో జోరందుకున్నాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. సూర్యతో సినిమా చేయడానికి రాజమౌళి సానుకూలంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే, ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అత్యంత క్రేజీ కాంబినేషన్లలో ఇది ఒకటిగా నిలవడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. నిజానికి సూర్య-రాజమౌళి కాంబినేషన్‌పై ఇలాంటి వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు. ఇలాంటి వార్తలు గతంలో కూడా తెగ హల్చల్ చేశాయి. గతంలో రాజమౌళి తెరకెక్కించిన ‘మగధీర’ చిత్రంలో హీరోగా ముందు సూర్య పేరును పరిశీలించినట్లు అప్పట్లో జోరుగా ప్రచారం కూడా జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. అనంతరం కూడా పలుమార్లు వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారనే వార్తలు వినిపించినప్పటికీ, అవి అధికారికంగా ఎప్పుడూ ప్రకటించలేదు. తాజాగా మరోసారి ఈ కాంబినేషన్‌పై మరోసారి వార్తలు రావడంతో సూర్య అభిమానులు మస్త్ ఖుషీ అవుతున్నారు. అయితే ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్‌పై రాజమౌళి, సూర్య నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన బయటికి రాలేదు.
Also Read
- Grand Comeback: హ్యాట్రిక్ ప్లాన్‌తో వస్తున్న హీరో.. గ్రాండ్ కంబ్యాక్‌కు మాస్టర్ స్ట్రాటజీ!
- Dil Raju: న్యాచురల్ స్టార్ నానికి రూ.110 కోట్ల ఆఫర్ ఇచ్చిన దిల్ రాజు.. ఇది నిజమేనా?
- Kiran Abbavaram: నన్ను తిట్టారు.. కొట్టారు.. తన్నారు! కిరణ్ అబ్బవరం ఎమోషనల్ కామెంట్స్!
- #BanTheCensor: ఆర్జీవీ సంచలన పోస్ట్.. "ప్రేక్షకులను చిన్నపిల్లల్లా చూడొద్దు.. సెన్సార్ బోర్డును రద్దు చేయాలి"
తాజావార్తలు
-
New Railway Station: మరో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి.. జులై 17న ప్రారంభం..
-
Grand Comeback: హ్యాట్రిక్ ప్లాన్‌తో వస్తున్న హీరో.. గ్రాండ్ కంబ్యాక్‌కు మాస్టర్ స్ట్రాటజీ!
-
PoK Protest: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో హింసాకాండ.. 12 మంది మృతి, రేంజర్ల మోహరింపు..
-
Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త.. ఇక నిమిషాల్లోనే సిలిండర్ డెలివరీ..
-
Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!