K.Raghavendra Rao: శతాధిక చిత్రాల దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. ఎన్నో అద్భుతమైన చిత్రాలకు దర్శకత్వం వహించి తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక పేజీని సృష్టించుకున్నాడు దర్శకుడు దర్శకేంద్రుడు. ఆయనకు రొమాంటిక్ సాంగ్స్ కి పెట్టింది పేరు. భక్తిరస చిత్రాలు తీయడంలో కూడా దిట్ట. అన్నమయ్య, శ్రీరామదాసు సినిమాలతో రాఘవేంద్రరావు ప్రేక్షకులను మెప్పించారు. రాఘవేంద్రరావు ప్రతిభకు ఎన్నో అవార్డులు వచ్చాయి. ఇప్పుడు సినిమాలను తగ్గించుకున్నాడు. రీసెంట్ గా శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీలీల హీరో హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా పెళ్లి సందడితో మళ్లీ హిట్ ఇచ్చారు. నేను డైరెక్టర్‌ని కాకపోతే డ్రైవర్‌ని అయ్యేవాడిని అంటూ ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాటలు నవ్వు తెప్పించాయి. రాఘవేంద్రరావు మాట్లాడుతూ కేవలం డ్రైవింగ్ వచ్చు కాబట్టి నేను డ్రైవర్ అయ్యేవాడిని అని చెప్పుకొచ్చారు. అలాగే నా పేరు వెనక బీఏ పెట్టి తీసిన రెండు మూడు సినిమాలు బాగా వచ్చాయి. బీఏ పెట్టని ఒకే ఒక్క సినిమా ఫ్లాప్ అయింది. అందుకే.. బీఏ సెంటిమెంట్ గా అనిపించి నా పేరు చివరన బీఏ యాడ్ చేయాలని నేను ఫిక్స్ అయ్యానని రాఘవేంద్ర రావు అని చెప్పుకొచ్చారు.
Read also: K Vishwanath: కళాతపస్వికి కన్నీటి నీరాజనం.. ప్రధాని సహా ప్రముఖుల సంతాపం
అయితే.. దర్శకుడిగా ఎన్నో గొప్ప విజయాలు సాధించిన కె.రాఘవేంద్రరావు ఇప్పుడు డిజిటల్ బాట పట్టారు. అతను కొత్త యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించాడు. ఈవిషయమై ఆయన ట్వీట్టర్ ద్వారా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ‘కేఆర్‌ఆర్ వర్క్స్’ పేరుతో ఓ ఛానెల్‌ని స్థాపించారు. దీన్ని మరో లెజెండరీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రారంభించారు. రాఘవేంద్రరావు ఎన్నో దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో మందిని పరిచయం చేశారు. ఎంత చేసినా అతని తపన ఆగలేదు. ఇప్పుడు మరింత మందిని వెండితెరకు పరిచయం చేసేందుకు ‘కేఆర్‌ఆర్ వర్క్స్’ ఛానెల్‌ని స్థాపించారు. నేను దీన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. 80 ఏళ్ల యువ దర్శకుడు రాఘవేంద్రరావుకు ఆల్ ది బెస్ట్’ అని రాజమౌళి అన్నారు. సామాన్యులను సెలబ్రిటీలుగా మార్చేందుకే రాఘవేంద్రరావు ఈ ఛానెల్‌ని ప్రారంభించారని యాంకర్ సుమ అన్నారు. క్రియేటివ్ షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్స్, యాక్టింగ్ రీల్స్, మ్యూజిక్ ఆల్బమ్స్, వెబ్ సిరీస్ స్టోరీలను తమతో పంచుకోవాలని సూచించారు.
కొత్తవారికి అవకాశాలు ఇవ్వాలి అని నేను సంకల్పించిన మహాయజ్ఞం లో భాగంగా ఈ రోజు రాజమౌళి చేతుల మీదుగా KRR Works అనే యూట్యూబ్ చానెల్ ప్రారంభించడం జరిగింది. https://t.co/k3dM1AyDq2
Like, Share and Subscribe
K Raghavendra Rao
— Raghavendra Rao K (@Ragavendraraoba) February 2, 2023
Nizamabad Crime: బెంచీ మీద కూర్చునే విషయంపై విద్యార్థుల మధ్య గొడవ.. ఛాతీపై బలంగా..