మీకు తెలుసా? ఎన్నో సమస్యల నుంచి బయటపడేందుకు బార్లీని పురాతన కాలంలో ఎక్కువగా తినేవారట. ఆయుర్వేదంలో వీటిని ఔషదంగా ఉపయోగిస్తారు.
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి , డయాబెటీస్ ను కంట్రోల్ లో ఉంచడానికి సహాయపడుతుంది.
బార్లీలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థకు ఆరోగ్యకరమైనది. ఎందుకంటే వీటి వాడకం వల్ల జీర్ణ సమస్యలు దూరమవుతాయి. అలాగే మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి.
బార్లీ నీటిని తాగడం వల్ల తరచుగా ఆకలయ్యే సమస్యే ఉండదు. అలాగే మీరు తక్కువ మొత్తంలో కేలరీలను తీసుకుంటారు. ఇది మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
బార్లీలో ఉండే విటమిన్లు, ఖనిజాలు మీ శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి సిద్ధం చేస్తాయి. అలాగే మీ రోగనిరోధక శక్తిని కూడా బలోపేతం చేస్తుంది.
బార్లీ నీటిలో విటమిన్ సి ఎక్కువగా ఉన్న నిమ్మకాయ రసాన్ని కలపడం వల్ల ఇది మరింత
ప్రభావవంతంగా ఉంటుంది.
బార్లీ నీటిని తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. ఈ నీరు మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది.
దీంతో గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (యుటిఐ) సమస్యలను తగ్గించడానికి కూడా బార్లీ వాటర్ ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
బార్లీ నీరు మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అలాగే ఎక్కువ మూత్ర విసర్జనకు సహాయపడుతుంది.
కిడ్నీ స్టోన్స్ సమస్య కూడా తొందరగా తగ్గిపోతుంది. మూత్రపిండాలు పూర్తిగా శుభ్రంగా ఉంటాయి. దీని వల్ల యూటీఐ లాంటి సమస్య వచ్చే అవకాశం ఉండదు.