SS Karthikeya: ఎస్ఎస్. కార్తికేయ.. పరిచయం అక్కర్లేని పేరు. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ విన్నర్ గా నిలిచింది అంటే అందుకు కారణమైన వ్యక్తుల్లో ఒకరు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. ఆ ఖర్చులను, ప్రమోషన్స్ ను దగ్గర ఉండి చూసుకోవడం, రాజమౌళికి హెల్ప్ చేయడం ఇలాంటివి అన్ని కార్తికేయ వలనే అయ్యాయి. ఇక కార్తికేయ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడాలంటే.. ఆయన రాజమౌళి సొంత కొడుకు కాదన్న విషయం చాలా తక్కువమందికి తెలుసు. రమా రాజమౌళి, రాజమౌళి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పటికే రమాకు కార్తికేయ పుట్టేసి ఉన్నాడు. మొదట రాజమౌళిని నిరాకరించిన రమా.. కార్తికేయపై రాజమౌళి చూపిస్తున్న ప్రేమకు ముగ్దురాలై పెళ్ళికి ఒప్పుకుందట. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వీరిద్దరూ తండ్రికొడుకులాన్నే కనిపించేవారు. ఎక్కడా కూడా వీరిద్దరూ సొంత తండ్రీకొడుకులు కాదా అన్న అనుమానం కూడా ఎవరికి రానివ్వలేదు.
Agent: అయ్యగారు వైల్డ్ అని తెలుసు కానీ.. మరీ ఇంత వైల్డ్ అని అనుకోలేదే
ఇక తాజాగా కార్తికేయ ఒక ఇంటర్వ్యూలో తన సినిమాల విషయాలను, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ రావడం కోసం చాలా కష్టపడ్డామని చెప్పిన కార్తికేయ రూ. 80 కోట్లు ఖర్చుపెట్టాం అని వచ్చిన రూమర్స్ ను ఖండించాడు. ఆస్కార్ కు మొదట ఏ కేటగిరికి పంపించాలి అన్న ఆలోచన చేస్తూ చేస్తూ.. ఎక్కడో బెస్ట్ ఫిల్మ్ కు పెడితే వస్తుందేమో.. కొంచెం హోప్ ఉండేదని, కానీ, డిస్సపాయింట్ మాత్రం కాలేదని తెలిపాడు. ఇక తన భార్య పూజా సింగర్ అని, ఆమెను పాడించాలని మాకు ఉందని, కానీ ఆమె ఒప్పుకోవడం లేదని అన్నాడు. ఇక అమ్మ సింగిల్ మదర్.. ఆ సమయంలో రాజమౌళి వచ్చి ఆమెను పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు.. మీరెలా అనుకున్నారు.. అన్న ప్రశ్నకు కార్తికేయ మాట్లాడుతూ.. “అమ్మ, రాజమౌళి పెళ్లి చేసుకోవడానికి ఏడాది ముందు నుంచే ఆయన మా ఇంటికి వచ్చేవారు.. నన్ను, అమ్మను డిన్నర్ కు తీసుకెళ్లేవారు. ఆ వైబ్ వచ్చేసింది. ఒక ఫాదర్ ఫీల్ వచ్చేసింది.. తనను వదలాలి అనిపించలేదు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.