Agent: అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఏజెంట్. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన అఖిల్ .. వరుస ఇంటర్వ్యూలు ఇవ్వడంతో పాటు వెరైటీ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టి సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాడు. ఏజెంట్ సినిమాలో అఖిల్ స్పై గా నటిస్తున్న విషయం తెల్సిందే. ఇందులో బాడీ కోసం, ఆ హెయిర్ కోసం రెండేళ్లు కష్టపడినట్లు చెప్పుకొచ్చాడు. ఇక అందులో యాక్షన్ సీన్స్ కోసం ఎంత కష్టపడ్డాడో రియల్ గా ఈ సినిమా ప్రమోట్ చేయడం కోసం కూడా అంతే కష్టపడుతున్నాడు.
Salaar: షాకింగ్.. విలన్ గా ప్రభాస్..?
తాజాగా 172 అడుగుల ఎత్తు నుంచి అఖిల్ కిందకు దూకాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఒక హీరో ఈ విధంగా ప్రమోషన్స్ చేయడం ఇదే మొదటిసారి. ఏజెంట్ ప్రమోషన్స్ కోసం విజయవాడ వెళ్లిన అఖిల్.. అక్కడ క్రేజీ ఫీట్ ను చేశాడు. థియేటర్ పై నుంచి కిందవరకు రోప్ కట్టుకొని కిందకు దూకుతూ ఒక వైల్డ్ పోస్టర్ ను రిలీజ్ చేశాడు. 172 అడుగులు ఉన్న ఆ థియేటర్ పై నుంచి అఖిల్ దూకుతుంటే.. కింద ఉన్న అభిమానులు ఏజెంట్ .. అఖిల్ అంటూ అరవడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమా టీజర్ లో సాలా కాదు వైల్డ్ సాలా అని పిలువు అన్నట్లు గానే నిజంగా ఈ వైల్డ్ ఫీట్ ను చేసి ఆశ్చర్యపరిచాడు. అఖిల్ ఈ సినిమాపై చూపిస్తున్న కాన్ఫిడెంట్ ఏ విధంగా వర్క్ అవుట్ అవుతుందో చూడాలంటే ఇంకో వారం ఆగాల్సిందే.
SAALA nahin!
WILD SAALA 😎That was a Crazy Event at Vijayawada as @AkhilAkkineni8 jumped off from 172 ft High to unveil the WILD POSTER 🔥
WILD MADNESS Loading in Theaters from APRIL 28TH💥#AGENTonApril28th @mammukka @DirSurender @AnilSunkara1 @AKentsOfficial @Shreyasgroup pic.twitter.com/yJMKmQOTyc
— AK Entertainments (@AKentsOfficial) April 16, 2023