2023లో ఇండియన్ సినిమా బాక్సాఫీస్ ని కుదిపేసిన సినిమా పఠాన్. కింగ్ ఖాన్ షారుఖ్ కంబ్యాక్ మూవీగా పేరు తెచ్చుకున్న పఠాన్ సినిమా ఆ రేంజ్ హిట్ అవ్వడానికి సల్మాన్ ఖాన్ కూడా కారణమే. ఎక్స్టెండెడ్ క్యామియో ప్లాన్ చేసిన సల్మాన్ ఖాన్, టైగర్ పాత్రలో కనిపించి సూపర్బ్ ఫైట్ చేసాడు. షారుఖ్, సల్మాన్ లని పఠాన్-టైగర్ లుగా చూడడానికి బాలీవుడ్ ఆడియన్స్ మాత్రమే కాదు మొత్తం ఇండియన్ మూవీ లవర్స్ థియేటర్స్ కి వెళ్లారు. దీంతో బాక్సాఫీస్ దగ్గర అత్యంత వేగంగా వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా పఠాన్ హిస్టరీకి ఎక్కింది. షారుఖ్, సల్మాన్ కాసేపు కలిసి కనిపిస్తేనే ఇలా ఉంటే ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అయిన ఈ ఇద్దరూ కలిసి ఒక ఫుల్ లెంగ్త్ యాక్షన్ సినిమా చేసే ఎలా ఉంటుంది అనే ఆలోచన నుంచి పుట్టింది ‘టైగర్ vs పఠాన్’ సినిమా. వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీకి పునాదిగా ‘టైగర్ 3’ రెడీ అవుతోంది.
పఠాన్ సినిమాలో సల్మాన్ ఖాన్ క్యామియో ప్లే చేసినట్లు, టైగర్ 3 సినిమాలో షారుఖ్ ఖాన్ కనిపించనున్నాడు. ఇప్పటికే షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్న ఈ కాంబినేషన్ కోసం మూవీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ పడే టైం దగ్గరలోనే ఉంది. షారుఖ్ ఖాన్-సల్మాన్ ఖాన్ టైగర్ 3 కన్నా ముందే కలిసి కనిపించనున్నారని సమాచారం. షారుఖ్ ప్రస్తుతం జవాన్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఇటీవలే ప్రీవ్యూతో జవాన్ సినిమా బాలీవుడ్ హీట్ పెంచింది. ఈ జోష్ ని మరింత పెంచడానికి సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ ఓటీటీ షోలో షారుఖ్ ఖాన్ కనిపించనున్నాడు. ఈ ఇద్దరూ కలిసి సందడి చేస్తే జవాన్ సినిమాపై అంచనాలు అమాంతం పెరగడం ఖాయం.