Actors Re-Union : సినిమా ఇండస్ట్రీలో రీ యూనియన్స్ అనేవి చాలా రేర్ గా కనిపిస్తుంటాయి. ఇప్పటి జనరేషన్ మధ్య పెద్దగా బాండింగ్ లేదు. కానీ 1990, 80 బ్యాచ్ లు మాత్రం ఏడాదికి ఒకసారి రీ యూనియన్ అవుతూనే ఉంటాయి. అప్పటి హీరోయిన్లు అయితే రీ యూనియన్ అవుతూ ఫొటోలు పెడుతుంటారు. రీసెంట్ గానే సిమ్రాన్, మీనా లాంటి వారు కలిసి ఎంజాయ్ చేశారు. ఇప్పుడు బండ్ల గణేశ్ అలాంటి రీ యూనియన్ ఏర్పాటు చేశారు. తన ఇంట్లోనే ఏర్పాటు చేసిన పార్టీకి అప్పటి నటులు హాజరు అయ్యారు. ఇందులో శ్రీకాంత్, అలీ, శివాజీ, హీరో శివాజీ, దర్శకుడు రాఘవేంద్రరావు లాంటి వారు ఉన్నారు.
Read Also : Tollywood : సీఎం రేవంత్ ను కలిసిన నిర్మాతలు, డైరెక్టర్లు
ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరంతా అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఎంజాయ్ చేసినట్టు తెలుస్తోంది. వీరంతా అప్పట్లో హీరోలుగా, నటీనటులుగా సినిమాలు ఎన్నో చేశారు. మరీ ముఖ్యంగా రాఘవేంద్రరావు సినిమాల్లో వీరు ఎక్కువగా కనిపించేవారు. అందుకే ఈ యూనియన్ కు ఆయన్ను స్పెషల్ గా ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వీరందరూ నటులుగా రాణిస్తున్నారు. ఇంకొందరు బిజినెస్ లు చేసుకుంటున్నారు. సింపుల్ గా బండ్ల గణేశ్ ఇంట్లోనే వీరందరూ పార్టీ చేసుకున్నట్టు తెలుస్తోంది.
Read Also : Madarasi Trailer : మదరాసి ట్రైలర్ రిలీజ్.. ఎలా ఉందంటే..?
❤️❤️❤️ https://t.co/012bWQOLKy
— BANDLA GANESH. (@ganeshbandla) August 24, 2025