Srikanth Addala : సూపర్ స్టార్ మహేశ్ బాబు, విక్టరీ వెంకటేశ్ కాంబోలో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ క్లాసిక్ ఎవర్ గ్రీన్. ఆ మూవీకి స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికీ టీవీల్లో వస్తే అలాగే చూస్తుండిపోతారు. ఈ మూవీలో మహేశ్ బాబు, వెంకటేశ్ పెద్దోడు, చిన్నోడు పాత్రల్లో నటించారు. వీరిద్దరూ మాట్లాడుకునే టైమ్ లో చిన్నోడు పూలకుండిని తన్నే సీన్ ఉంటుంది. చెల్లెలి పెళ్లిలో రావు రమేశ్ అవమానించడంతో పెద్దోడు బాధపడుతూ చిన్నోడిని నాటకాలు వేసుకో అంటాడు. అప్పుడే చిన్నోడు పూలకుండీని తన్నేస్తాడు.
Read Also : Mohan Lal : మార్చి 27న థియేటర్లలోకి మోహన్ లాల్ ‘L2 ఎంపురాన్’..
చిన్నోడు పూలకుండీని ఎందుకు తన్నాడనేది ఇప్పటికీ ఓ సస్పెన్స్. అయితే దానికి తాజాగా డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల క్లారిటీ ఇచ్చాడు. ‘సినిమాలో చిన్నోడికి పెద్దోడు అంటే చాలా ఇష్టం, ప్రేమ. అయితే పెద్దోడికి గెలవాలనే తపన లేకపోవడంపై చిన్నోడికి కొంత కోపం ఉంటుంది. అది మాటల్లో చూపించలేక అప్పుడప్పుడు వస్తువులపై చూపిస్తుంటాడు. అందుకే దానికంటే ముందు డైనింగ్ టేబుల్ మీద వస్తువులను విసిరేస్తాడు. చెల్లెలి పెళ్లి టైమ్ లో వెంకటేశ్ తనకేం పట్టనట్టు అలా మూలన నిలబడం చిన్నోడికి నచ్చదు. అడిగితే నాటకాలు వేసుకోపో అని చిన్నోడిని అంటాడు. దాంతో ఇవన్నీ తట్టుకోలేక ఆ కోపాన్ని అన్న మీద చూపించలేక ఆ పూలకుండీని తన్నేస్తాడు. అదొకరకమైన బాధను చూపించడమే’ అంటూ శ్రీకాంత్ క్లారిటీ ఇచ్చాడు.