Mohan Lal : మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘L2 ఎంపురాన్’. పృథ్వీరాజ్ సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. దీన్ని లూసీఫర్ కు సీక్వెల్ గా రూపొందించారు. జనవరిలో రిలీజ్ అయిన టీజర్ కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాను మళయాలంతో పాటు ఇటు తెలుగులో కూడా ఒకేరోజు రిలీజ్ చేస్తున్నారు. మురళి గోపి కథ అదించగా.. ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై సుబాస్కరన్, ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ సంయుక్తంగా నిర్మించారు.
Read Also : Ram Charan : రామ్ చరణ్ లేటెస్ట్ లుక్ చూశారా.. ఊరమాస్..!
మోహన్ లాల్ ఈ సినిమాలో ఖురేషి-అబ్రామ్ అలియాస్ స్టీఫెన్ నెడుంపల్లిగా కనిపించబోతున్నారు. డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్, టొవినో థామస్, మంజు వారియర్, ఇంద్రజిత్ సుకుమారన్ లు కీలక పాత్రలు చేశారు. రెండేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని త్వరలోనే ప్రేక్షకులను పలకరించబోతోంది. హిట్ మూవీకి సీక్వెల్ కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. 1:2.8 రేషియోతో అనమోర్ఫిక్ ఫార్మాట్‌లో ఈ మూవీని తెరకెక్కించారు. మ్యూజిక్ డైరెక్టర్ దీపక్ దేవ్ కూడా పాటలతో ఆకట్టుకున్నాడు.