యంగ్ హీరో సుధీర్ బాబు నటించిన “శ్రీదేవి సోడా సెంటర్” ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. సూపర్ స్టార్ మహేష్ బాబు ట్రైలర్ ను విడుదల చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సినిమా సక్సెస్ కావాలని కోరారు. ట్రైలర్ చూస్తుంటే ఇది రివేంజ్ డ్రామాలా కన్పిస్తోంది. ఇంతవరకూ టీజర్, పోస్టర్లతో సినిమాను సాఫ్ట్ కార్నర్ లో చూపించిన మేకర్స్ ట్రైలర్ లో మాత్రం డిఫరెంట్ గా మాస్ తో యాక్షన్ ను కూడా చూపించారు. సుధీర్ బాబు యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయి.
Read Also : బండ్ల గణేష్ నిర్ణయం మార్చుకున్నాడు !
హీరో జైలు నుంచి బయటకు రావడం, తరువాత హీరోయిన్ తో ప్రేమాయణం, అది వారి ఇంట్లో తెలియడం, ఊర్లో కొంతమంది ప్రమేయంతో హీరోహీరోయిన్ల ప్రేమను విడగొట్టడంతో ఎమోషనల్ యాంగిల్, హీరోను జైలుకు పంపడం, అతను అక్కడి నుంచి వచ్చాక తన ప్రేమను విడదీసిన వారిపై పాగా తీర్చుకోవడంతో రివేంజ్, ఇక ఫన్, లవ్ ఇలా అన్ని ఎమోషన్స్ కలగలిపి షడ్రుచుల సమ్మెళనంగా సినిమా ఉంటుంది అంటూ రెండున్నర నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్ లోనే చెప్పేశారు. ఈ లవ్ స్టోరీ ట్రైలర్ లో విజువల్స్, డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.
ఇప్పటికే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు షురూ అయ్యాయి. ఆగస్ట్ 27న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బజ్ చాలా పాజిటివ్‌గా ఉంది. మహేష్ ప్రమోషన్లలో చేరడంతో సినిమాపై హైప్ మరింతగా పెరిగింది. ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన తెలుగమ్మాయి ఆనంది హీరోయిన్ గా నటించింది. ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహించగా, విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ మూవీని 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో సంయుక్తంగా నిర్మించారు. మణిశర్మ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలో సుధీర్ బాబు లైటింగ్ సూరిబాబుగా, ఆనంది శ్రీదేవిగా కనిపించబోతున్నారు.