Sree Leela Intresting Comments on First Lip Kiss: తెలుగమ్మాయి అయినా కన్నడలో కెరీర్ మొదలు పెట్టిన శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ లో దూసుకుపోతోంది. ఆమె నటించిన సినిమాలు మంచి సక్సెస్ అందుకోవడంతో ఆమెకు దర్శక నిర్మాతలు సినిమాల ఆఫర్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం శ్రీలీల చేతిలో సుమారు అర డజన్ కు పైగా సినిమాలు ఉండగా అవన్నీ దాదాపుగా పెద్ద సినిమాలే లేదా పెద్ద బ్యానర్ల సినిమాలే. ఆమె రీసెంట్ గా నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్రం మంచి హిట్ అందుకోగా ఆ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీ బిజీగా గడుపుతోంది శ్రీ లీల. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాకు వరుసబెట్టి ఇంటర్వ్యూలు ఇస్తోన్న క్రమంలో సినిమాలతో పాటు పలు వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేసుకుంటోంది.
Skanda: స్కంద ఓటీటీ ఆగమనం మరింత లేటు?
ఇందులో భాగంగా ఆమె టాలీవుడ్ లో లిప్ లాక్ సీన్ చేయాల్సి వస్తే, ఎవరితో చేస్తారు? అని ఓ యాంకర్ అడిగింది. ఈ ప్రశ్నకు ఆమె తెలివిగా ఆన్సర్ ఇచ్చింది. ముందు తాను ఏ హీరోతో లిప్ లాక్ సీన్లు చేయను అని చెప్పిన ఆమె ఒకవేళ అలా చేయాల్సి వస్తే మాత్రం తన భర్తకే తొలి కిస్ ఇస్తానని చెప్పింది. అంటే ఒక్కమాటలో మొత్తంగా తాను లిప్ లాక్ సీన్లు చేసే ప్రసక్తే లేదని శ్రీలీల తేల్చి చెప్పిందని అంటున్నారు. అయితే నిజానికి ఆమె గతంలోనే ఒక లిప్ లాక్ సీన్ చేసిందని అంటున్నారు. శ్రీలీల 2019లోనే కిస్ అనే ఒక కన్నడ సినిమా చేసింది, దాన్ని ఐ లవ్ యూ ఇడియట్ అనే పేరుతో తెలుగులో ఆహా రిలీజ్ చేసింది. అయితే ఆ సినిమాలోనే ఆమె హీరో విరాట్ కి మూతి ముద్దు ఇచ్చేసింది అని ఇప్పుడు అసలు ఎవరికీ ఇవ్వను అన్నట్టు చెబుతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.