Skanda OTT streaming Postponed: రామ్ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్లో స్కంద అనే సినిమా తెరకెక్కింది. బోయపాటి శ్రీను స్నేహితుడి చిట్టూరి శ్రీను నిర్మాణంలో శ్రీ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై ఈ సినిమాను ఒక రేంజ్ లో తెరకెక్కించి రిలీజ్ చేశారు. శ్రీ లీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఈరోజు కావాల్సి ఉంది కానీ ఇప్పుడు వాయిదా పడింది. ఈ వార్త రామ్ అభిమానులను నిరాశకు గురిచేస్తుంది, కానీ అనుకోని కారణాల వల్ల, స్కంద OTT స్ట్రీమింగ్ వాయిదా పడింది. నిజానికి ఈ రాత్రి నుండి డిస్నీ హాట్‌స్టార్‌లో ఈ సినిమా స్ట్రీమ్ కావాల్సి ఉంది కానీ ఇప్పటికీ, టీమ్ నుంచి ఎటువంటి అప్‌డేట్ లేదు.
They Call Him OG: పర్ఫెక్ట్ ఫ్యాన్ బాయ్ సంభవం లోడింగ్…
ఈ సినిమా OTT విడుదల నవంబర్ 2వ వారానికి వాయిదా పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ, ఇది ఆలస్యం అయ్యిందా లేదా అనే విషయంపై ప్రాథమికంగా ఈరోజే స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమాలో రామ్ సరసన టాలీవుడ్ సెన్సేషన్ శ్రీ లీల హీరోయిన్ గా నటించింది. సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, శరత్ లోహితస్వా, ప్రిన్స్ సిసిల్, అజయ్ పుర్కర్, దగ్గుబాటి రాజా, ప్రభాకర్, పృథ్వీరాజ్ తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషించిన ఈ సినిమాలో ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ఈ స్కంద సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందించగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ మరియు ZEE స్టూడియోస్ బ్యానర్లపై శ్రీనివాస చిట్టూరి, పవన్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.