Spider- Man: అరబ్ కంట్రీలో ‘స్పైడర్ మేన్’కి కొత్త చిక్కు వచ్చిపడింది. అదీ సెన్సార్ కారణంగా… నిజానికి దేశదేశానికీ మధ్య సినిమా సెన్సార్ బోర్డ్ రూల్స్ లో తేడా ఉంటుంది. అరబ్ ఎమిరేట్స్ లో సెన్సార్ నిబంధనలు బాగా కఠినంగా ఉంటాయి. దీంతో ‘స్పైడర్ మేన్: అక్రాస్ ద స్సైడర్ వర్స్’ సినిమాకు చిక్కులు తప్పలేదు. అదేంటో చూద్దాం. ఎంతో కాలంగా ‘స్పైడర్ మేన్’ కథ ఆబాలగోపాలాన్నీ ఎన్నో దశాబ్దాలుగా అలరిస్తూ వస్తోంది. ఇక ఈ యేడాది యానిమేషన్ మూవీగా ‘స్పైడర్ మేన్ – అక్రాస్ ద స్పైడర్ వర్స్’ సినిమా జూన్ 1న ఇండియాలో విడుదలైంది. వంద మిలియన్ డాలర్లతో రూపొందిన ఈ చిత్రం ఇప్పటి దాకా 400కు పైగా మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అయితే ఈ సినిమా ఇంకా కొన్ని దేశాల్లో విడుదల కావలసి ఉంది. అందులో భాగంగా ‘యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్’లో ఈ సినిమాను జూన్ 22న విడుదల చేయటానికి ప్లాన్ చేశారు. ‘అరబ్ ఎమిరేట్స్’ నిబంధనల ప్రకారం అక్కడ మరోసారి సెన్సార్ తప్పలేదు.
Kiara Advani: ‘వార్ 2’ లోకి కియారా.. ఎన్టీఆర్ కు జోడిగానేనా..?
‘స్పైడర్ మేన్- అక్రాస్ ద స్పైడర్ వర్స్’ చిత్రంలో ఓ చోట ‘ట్రాన్స్ జెండర్స్’ను సపోర్ట్ చేసే విధంగా ‘ప్రొటెక్ట్ ట్రాన్స్ లైఫ్’ అనే ఒక జెండా కనిపిస్తుంది. అయితే అరబ్ దేశాల్లో స్వలింగ సంపర్కం నిషేధం. అందువల్ల ట్రాన్స్ జెండర్స్ కు మద్దతుగా ఎవరు ఏమి చేసినా దానిని తీవ్రంగా పరిగణిస్తారు. అందుకే ‘స్పైడర్ మేన్ – అక్రాస్ ద స్సైడర్ వర్స్’లో ట్రాన్స్ జెండర్స్ జెండా ఉన్న సీన్స్ తొలగించాలని సెన్సార్ బోర్డ్ ఆదేశించింది. అలా చేయని పక్షంలో అరబ్ దేశాల్లో సినిమాను విడుదల చేయనివ్వబోమని తేల్చి చెప్పింది అరబ్ సెన్సార్ బోర్డ్. యానిమేషన్ సినిమా అయినా సరే, నిబంధనలు పాటించి తీరవలసిందే అన్నది అరబ్ ఎమిరేట్స్ సెన్సార్ బోర్డ్ వారి వాదన. గత సంవత్సరం డిస్నీ సంస్థ నిర్మించిన ‘లైట్ ఇయర్’ యానిమేషన్ మూవీకి కూడా ఇలాగే కొన్ని ఇబ్బందుల ఎదురయ్యాయి. అందులో ఇద్దరు లెబ్సియన్స్ ముద్దు పెట్టుకునే సన్నివేశం ఉంది. డిస్నీ సంస్థ కట్స్ కు అంగీకరించక పోవడంతో ‘లైట్ ఇయర్’ సినిమా అరబ్ దేశాల్లో విడుదల కాలేదు. ఇప్పుడు ‘స్పైడర్ మేన్- అక్రాస్ ద స్పైడర్ వర్స్’ సినిమా అనుకున్న తేదీకి అరబ్ కంట్రీస్ లో విడుదల చేయాలంటే ‘ప్రొటెక్ట్ ట్రాన్స్ లైఫ్’ జెండా కనిపించే సీన్స్ ను కత్తిరించాల్సి ఉంటుంది. ‘లైట్ ఇయర్’ సినిమాలో కట్స్ కి ఒప్పుకోని డిస్నీ ఇప్పుడు ఈ సినిమాలో కట్స్ కు ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటే అనుకున్న టైమ్ కి రిలీజ్ అవుతుంది. లేకుంటే ‘స్పైడర్ మేన్ – అక్రాస్ ద స్పైడర్ వర్స్’ సినిమా కూడా అరబ్ దేశాల్లో విడుదల కానట్టే. మరి ఏం జరుగుతుందో చూడాలి.