Kiara Advani:యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ .. బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. స్పై యూనివర్స్ గా తెరకెక్కుతున్న వార్ 2 లో ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెల్సిందే. బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ మల్టీస్టారర్ గా వచ్చిన వార్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాను యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించగా సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కించాడు. నాలుగేళ్ళ తరువాత యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాకు సీక్వెల్ ప్రకటించింది. ఈసారి టైగర్ ష్రాఫ్ ప్లేస్ లో ఎన్టీఆర్ రాబోతున్నాడు. ఇకపోతే వార్ 2 కు బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారుతోంది. ఈ స్పై యూనివర్స్ లోకి బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఎంట్రీ ఇవ్వనుందట.
Nandamuri Balakrishna: బాలయ్యతో జోకులు.. కమెడియన్ పంట పండినట్టే
అవును వార్ 2లో ఒక హీరోయిన్ గా కియారాను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కియారా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఈ స్పై యూనివర్స్ లో లేడీ స్పై గా ఈ ముద్దుగుమ్మ కనిపించనుందట. అయితే కియారా.. హృతిక్ రోషన్ కు జోడిగానా..? లేక ఎన్టీఆర్ కు జోడిగానా..? అన్న విషయం మాత్రం క్లారిటీ లేదు. అయితే అభిమానులు మాత్రం ఎన్టీఆర్ కే జోడిగా కియారాను తీసుకున్నారని చెప్పుకొస్తున్నారు. త్వరలోనే కియారాను మేకర్స్ అధికారికంగా పరిచయం చేయనున్నారట. మరి ఈ చిత్రంతో కియారా ఎలాంటి రేంజ్ ను సొంతం చేసుకోనున్నదో చూడాలి.