దసరా పండగ అక్టోబర్ 23న జరగనుంది. ఈ పెద్ద పండగకి సంబరాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి. సినిమాలు కూడా ఎక్కువగానే రిలీజ్ అయ్యాయి కాబట్టి దసరా రోజున ఫ్యామిలీతో సహా థియేటర్స్ కి వెళ్లి సినిమాలని ఎంజాయ్ చేయడానికి ఆడియన్స్ కూడా రెడీ అయ్యారు. ఆడియన్స్ దసరా పండగ సరే… మరి ఘట్టమనేని అభిమానుల పండగ పరిస్థితి ఏంటి అనేది క్లారిటీ రావట్లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘గుంటూరు కారం’. సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకే రేంజులో ఉన్నాయి. 2024 సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న గుంటూరు కారం సినిమా నుంచి మాస్ స్ట్రైక్ వీడియో తప్ప మరో ప్రమోషనల్ కంటెంట్ బయటకి రాలేదు.
ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ బయటకి వస్తుంది అనే వార్త చాలా రోజులుగా వినిపిస్తూనే ఉంది కానీ సాంగ్ మాత్రం బయటకి రావట్లేదు. ఈ సాంగ్ బయటకి వస్తే గుంటూరు కారం ప్రమోషన్స్ కిక్ స్టార్ట్ అవుతాయి. థమన్ సూపర్బ్ ట్యూన్ తో సాంగ్ ని కూడా కంప్లీట్ చేసాడు కానీ లిరికల్ సాంగ్ మధ్యలో ప్లే చేయడానికి అవసరమైన విజువల్స్ ని షూట్ చేయాల్సి ఉంది. ఈ వర్క్ పెండింగ్ ఉంది కాబట్టే సాంగ్ ని బయటకి రిలీజ్ చెయ్యట్లేదు. అయితే ఇటీవలే ప్రొడ్యూసర్ నాగ వంశీ మాట్లాడుతూ దసరాకి గుంటూరు కారం సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసే విషయంలో క్లారిటీ ఇస్తాము అని చెప్పాడు. దసరాకి సాంగ్ బయటకి వస్తుందా లేక దసరా రోజున సాంగ్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్తారా అనే విషయంలో క్లారిటీ లేదు. ఒకవేళ దసరాకి సాంగ్ రిలీజ్ అయితే ఈ పాటికి అనౌన్స్మెంట్ బయటకి వచ్చి ఉండాలి. ఆ అనౌన్స్మెంట్ బయటకి రాలేదు కాబట్టి గుంటూరు కారం నుంచి ఫస్ట్ సాంగ్ దాదాపు ఈ దసరాకి బయటకి రానట్లే.