Sobhita: “నా జీవితాన్ని మార్చింది అదే..” శోభితా ధూళిపాళ్ల క్రేజీ కామెంట్స్ వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు అమ్మాయి, గ్లోబల్ స్టార్ Sobhita Dhulipala తన అందం, నటనతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె, తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ‘గూడాచారి’, ‘మేజర్’, ‘పొన్నియన్ సెల్వన్’ వంటి సినిమాలతో పాటు బాలీవుడ్, హాలీవుడ్ ప్రాజెక్ట్స్‌లో కూడా నటిస్తూ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. నటిగా మాత్రమే కాకుండా తన ఆలోచనలు, వ్యక్తిత్వంతో కూడా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు నెటిజన్ల మనసు గెలుచుకుంటున్నాయి.
పరిస్థితులు ఎలా ఉన్నా సరే, ఎప్పుడూ తన అంతరాత్మ (Inner Voice) చెప్పిన మాటనే వింటానని ఆమె స్పష్టం చేశారు.. ‘మనసు మాట విన్నప్పుడే నా జీవితంలో ఎన్నో అర్థవంతమైన క్షణాలను ఆస్వాదించాను.. మనసు మాట వినకుండా చేసిన ఏ పనీ నాకు కలిసి రాలేదు’ అంటూ ఆమె చేసిన రిప్లై ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. జీవితాన్ని నదిపై సాగే ఒక చిన్న ప్రయాణంతో పోల్చిన శోభిత, ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని, మనల్ని మనం గౌరవించుకోవాలని సూచించారు. ఇక వృత్తిపరమైన విషయానికి వస్తే, ఈ ఏడాది ప్రారంభంలో ‘చీకటిలో’ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించిన శోభిత, ప్రస్తుతం తన తదుపరి తమిళ చిత్రం ‘వెట్టువం’ (Vettuvam) పనుల్లో బిజీగా ఉన్నారు. స్టార్ డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వంలో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. వివాహం తర్వాత ఆమె నటిస్తున్న మొదటి తమిళ చిత్రం ఇదే కావడం విశేషం.
Also Read
- Peddi : 'పెద్ది'తో రామ్‌చరణ్ పాన్ ఇండియా కొట్టాల్సిందే.. లేదంటే అంతే
- Kalki 2: 'కల్కి 2' సీక్వెల్‌పై షాకింగ్ అప్‌డేట్స్!
- Tollywood Box Office Disasters : కనీసం పోస్టర్ ఖర్చులు కూడా రాబట్టని ఈ వారం సినిమాలు
- DivyennduSharma : నాకు తెలుగు రానందుకు కొంత సిగ్గుగా అనిపించింది.. త్రివిక్రమ్ సినిమాలో చేస్తున్నాను
తాజావార్తలు
-
Sobhita: “నా జీవితాన్ని మార్చింది అదే..” శోభితా ధూళిపాళ్ల క్రేజీ కామెంట్స్ వైరల్!
-
Barley Upma Recipe: రెగ్యులర్ బ్రేక్‌ఫాస్ట్ బోర్ కొట్టిందా..? రుచికరమైన, ఆరోగ్యకరమైన బార్లీ ఉప్మా ట్రై చేయండి..
-
Hyderabad Traffic Restrictions: నగర వాసులకు బిగ్ అలర్ట్.. మోడీ పర్యటన వేళ ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు!
-
Peddi : ‘పెద్ది’తో రామ్‌చరణ్ పాన్ ఇండియా కొట్టాల్సిందే.. లేదంటే అంతే
-
Thalapathy Vijay Cabinet Ministers and Portfolios: విజయ్ కేబినెట్ ఖరారు.. కాసేపట్లో సీఎంగా ప్రమాణస్వీకారం.. ఇలా శాఖల కేటాయింపు