Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Office Romance on the Rise: ఆఫీస్ రొమాన్స్ అనేది ఇప్పుడు కేవలం సినిమాలకే పరిమితం కావడం లేదు. నిజ జీవితంలోనూ సర్వసాధారణమైపోయింది. తాజాగా ‘ఫోర్బ్స్’ వెల్లడించిన ఒక సర్వే నివేదిక ఆశ్చర్యకరమైన విషయాలను బయటపెట్టింది. ఈ నివేదిక ప్రకారం.. సుమారు 60 శాతానికి పైగా ఉద్యోగులు తమ పని ప్రదేశంలో ఎవరో ఒకరితో ప్రేమాయణం సాగించినట్లు తేలింది. రోజుకు దాదాపు 9 గంటల పాటు కలిసి పని చేయడం, వృత్తిపరమైన ఒత్తిడిని అర్థం చేసుకునే భాగస్వామి పక్కనే ఉండటం వంటి కారణాల వల్ల చాలామంది ఆఫీస్‌లోనే తమ తోడును వెతుక్కుంటున్నారు. ఈ అంశంపై కొందరు స్పందిస్తూ.. బయట కొత్త వ్యక్తులను కలిసే సమయం లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందని 61 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇక 38 శాతం మంది మాత్రమే ఆఫీస్ రొమాన్స్ వల్ల పనిలో ఉత్సాహం పెరుగుతుందని మరికొందరు భావిస్తున్నారు.
అయితే, ఈ ఆఫీస్ డేటింగ్ వల్ల వ్యక్తిగత జీవితంపైనే కాకుండా వృత్తిపరమైన బాధ్యతలపై కూడా ప్రభావం పడుతోందని ఈ సర్వే స్పష్టం చేస్తోంది. దాదాపు 54 శాతం మంది ఉద్యోగులు ఆఫీస్‌లో డేటింగ్ చేయడం వల్ల తమ వర్క్-లైఫ్ బ్యాలెన్స్ దెబ్బతిన్నదని అంగీకరించారు. అంతేకాకుండా, ఆఫీస్ వ్యవహారాలు ఎక్కువ కాలం రహస్యంగా ఉండవని, సుమారు 60 శాతం మంది ఇవి ఆఫీస్ గాసిప్స్‌కు కారణమవుతాయని తెలిపారు. ఒకవేళ బ్రేకప్ జరిగితే ప్రతిరోజూ అదే వ్యక్తిని ఆఫీస్‌లో ఎదుర్కోవడం మానసికంగా పెద్ద సవాలుగా మారుతుందని చాలామంది భయపడుతున్నారు.
Also Read
- Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
- Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన "కారప్పొడులు" సులువుగా చేసుకోండి ఇలా..!
- Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
ఈ రిపోర్ట్‌లో అన్నింటికంటే విస్తుపోయే అంశం ఏమిటంటే.. ఆఫీస్ రిలేషన్‌షిప్‌లో ఉన్నవారిలో 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేసి సహోద్యోగులతో సంబంధాలు పెట్టుకున్నట్లు సర్వేలో తేలింది. అదే సమయంలో సుమారు 43 శాతం మంది తమ ఆఫీస్ పార్ట్‌నర్‌నే పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారట. ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా కంపెనీలు సైతం ఈ విషయంలో నిబంధనలను సడలిస్తున్నాయి. సుమారు 62 శాతం మంది ఉద్యోగులు తమ ప్రేమ వ్యవహారాన్ని స్వయంగా హెచ్‌ఆర్ (HR) విభాగానికి తెలియజేయడం విశేషంగా మారింది. మొత్తం మీద, ఆఫీస్ ప్రేమలు భావోద్వేగాలకు వేదికగా మారుతున్నప్పటికీ, అవి అనేక సవాళ్లను సైతం వెంటబెట్టుకొస్తున్నాయని ఈ నివేదిక చెబుతోంది.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!