Hyderabad Traffic Restrictions: నగర వాసులకు బిగ్ అలర్ట్.. మోడీ పర్యటన వేళ ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Traffic Restrictions: నేడు ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటించనున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు సుమారు లక్ష మంది వరకు జనం వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు పరేడ్ గ్రౌండ్స్‌లో కనీవినీ ఎరుగని రీతిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మల్కాజిగిరి సీపీ బి.సుమతి పర్యవేక్షణలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతా బలగాలు నగరాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. సుమారు 2,000 మందికి పైగా పోలీసులతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. NSG (నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్), OCTOPUS, ప్రత్యేక బలగాలు నిరంతరం పరేడ్ గ్రౌండ్స్ పరిసరాలను పర్యవేక్షిస్తున్నాయి. ఈ బహిరంగ సభ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, తాత్కాలిక నిలిపివేతలు అమలులో ఉంటాయని నగర ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ట్రాఫిక్ రద్దీని నివారించడానికి, ప్రజలు మధ్యాహ్నం 13:00 గంటల నుంచి రాత్రి 20:00 గంటల మధ్య ఈ క్రింది రోడ్ల మార్గాల్లో ప్రయాణించవద్దని కోరారు.
బేగంపేట ఎయిర్‌పోర్ట్ – బేగంపేట – గ్రీన్‌ల్యాండ్స్ – పంజాగుట్ట – నాగార్జున సర్కిల్ – NFCL జంక్షన్ – SNT జంక్షన్ – సాగర్ సొసైటీ – NTR భవన్ – జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ – పెద్దమ్మ తల్లి ఖమాన్ – రోడ్ నెం. 36/31 – నీరూస్ జంక్షన్ – సైబర్ టవర్స్ జంక్షన్ – శిల్పారామం – హైటెక్స్ ఖమాన్ వద్ద కుడి మలుపు – NAC మెయిన్ గేట్ – బ్లాక్ 22 – ఎడమ మలుపు – కాసాని గేట్ – కుడి మలుపు – HICC చెక్ పోస్ట్ – రాక్ సర్కిల్ – VVIP అలైటింగ్ పాయింట్ ఈ రూట్లలో భారీగా ట్రాఫిక్ జామ్ ఉండనుంది.
Also Read
- Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
- India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
- Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
- US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
అలాగే, మధ్యాహ్నం 14:00 గంటల నుంచి రాత్రి 22:00 గంటల మధ్య M.G. రోడ్, R.P. రోడ్, S.D. రోడ్ మార్గాల్లో ప్రయాణించవద్దని విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లాలనుకునే ప్రయాణీకులు తమ గమ్యస్థానాలకు సకాలంలో చేరుకోవడానికి ముందస్తుగా బయలుదేరాలని కోరారు. సాధ్యమైనంత వరకు పౌరులు మెట్రో రైలు సేవలను వినియోగించుకోవాలని సూచించారు. నగర పౌరులు పైన పేర్కొన్న ట్రాఫిక్ సూచనలను గమనించి, ఆయా సమయాల్లో తమ ప్రయాణాలను తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని కోరారు. సమాచారం కోసం మా హైదరాబాద్ ట్రాఫిక్ హెల్ప్‌లైన్ (9010203626) అందుబాటులో ఉంటుందని, సోషల్ మీడియాలోనూ సంప్రదించాలని కోరారు.
తాజావార్తలు
-
Sreeleela : శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రానికి ముహుర్తం ఎప్పుడు..?
-
Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
-
Raashi Khanna : లీక్స్‌లో చిరంజీవినే మించిపోయింది రాశీ ఖన్నా
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
ట్రెండింగ్
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!