DivyennduSharma : నాకు తెలుగు రానందుకు కొంత సిగ్గుగా అనిపించింది.. త్రివిక్రమ్ సినిమాలో చేస్తున్నాను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్‌లో ‘మున్నా భయ్యా’గా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు దివ్యేందు శర్మ. తనదైన డైలాగ్ డెలివరీతో టాలీవుడ్ లోను అభిమానులను సంపాదించుకున్నాడు దివ్యేందు. ఇప్పుడు టాలీవుడ్లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన తన రాబోయే తెలుగు ప్రాజెక్టుల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది‘ చిత్రంతో దివ్యేందు శర్మ తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రం జూన్ 4న విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో తనకు ఎదురైన అనుభవాలను గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడూతూ ‘తెలుగు రాష్ట్రాల్లో ‘మీర్జాపూర్’ సిరీస్‌కు ఇంత పెద్ద ఫ్యాన్ బేస్ ఉంటుందని నేను ఊహించలేదు, తెలుగు ప్రజలు నాపై చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. షూటింగ్ సమయంలో నాకు తెలుగు రాకపోవడంతో కొంత సిగ్గుగా అనిపించింది. అందుకే నెమ్మదిగా తెలుగు భాషను నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను, తెలుగు ప్రేక్షకుల నుంచి నాకు వస్తున్న ఆదరణ చూసి ఆశ్చర్యపోయాను’ అని చెప్పుకొచ్చారు. అలాగే మొదటి సినిమా విడుదల కాకముందే దివ్యేందు శర్మ తన రెండో తెలుగు ప్రాజెక్టును కూడా లాక్ చేసుకున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందుతున్న చిత్రంలోను మున్నా భయ్యా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వరుసగా స్టార్ హీరోలు మరియు టాప్ దర్శకులతో పని చేసే అవకాశం రావడం పట్ల దివ్యేందు శర్మ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!