Barley Upma Recipe: రెగ్యులర్ బ్రేక్‌ఫాస్ట్ బోర్ కొట్టిందా..? రుచికరమైన, ఆరోగ్యకరమైన బార్లీ ఉప్మా ట్రై చేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Barley Upma Recipe: ఉదయాన్నే ఏం బ్రేక్‌ఫాస్ట్ చేయాలా అని ఆలోచిస్తూ విసిగిపోతున్నారా? ప్రతిరోజూ ఇడ్లీ, దోసె, ఉప్మా, పూరీ లాంటి ఒకే రకమైన అల్పాహారం తిని బోర్ కొట్టిందా? అయితే మీ కోసం ఒక టేస్టీ మరియు హెల్తీ రెసిపీ సిద్ధంగా ఉంది. అదే బార్లీ ఉప్మా. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఉదయం హడావిడిలో కూడా చాలా తక్కువ సమయంలో సులభంగా తయారు చేసుకోవచ్చు.
బార్లీ సాధారణ ధాన్యం కాదు. ఇందులో పీచుపదార్థం (ఫైబర్) సమృద్ధిగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఎక్కువసేపు ఆకలి వేయకుండా కడుపు నిండిన భావన కలిగిస్తుంది. దీంతో బరువు నియంత్రణలో కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా సెలీనియం, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు వంటి అనేక పోషకాలు బార్లీలో లభిస్తాయి. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందించి ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఉదయాన్నే త్వరగా అయ్యే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ కోసం చూస్తున్నవారికి బార్లీ ఉప్మా బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే ఈ రెసిపీని ఇప్పుడు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
Also Read
- Healthy Breakfast: బియ్యం లేకుండానే క్రిస్పీ జొన్న దోశలు.. షుగర్, బరువు నియంత్రణకు హెల్తీ బ్రేక్‌ఫాస్ట్!
- Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే 'సన్న కారపూస'.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
- Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
- Homemade Malai: పాల మీగడ మందంగా రావట్లేదా? ఈ 4 సింపుల్ టిప్స్ పాటిస్తే గిన్నె నిండా మీగడ పక్కా!
కావలసిన పదార్థాలు
* 1 కప్పు బార్లీ గంజి
* 1/2 కప్పు క్యాప్సికమ్ (సన్నగా తరిగినది)
* 1/2 కప్పు ఉల్లిపాయ (సన్నగా తరిగినది)
* 1 క్యారెట్ (తరిగినది)
* 2 టీస్పూన్లు కొత్తిమీర
* 1 టీస్పూన్ మినప పప్పు
* చిటికెడు ఆవాలు
* 1/2 కప్పు వేయించిన వేరుశెనగలు
* 1 టీస్పూన్ నిమ్మరసం
* తగినంత ఉప్పు
* అవసరమైనంత నూనె
బార్లీ ఉప్మా తయారీ విధానం
ముందుగా బార్లీని శుభ్రంగా కడిగి 15 నుంచి 20 నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి. తర్వాత నీటిని వడకట్టి కుక్కర్లో వేసి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఇప్పుడు ఒక బాణలిలో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. అందులో ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత మినప పప్పు వేసి స్వల్పంగా వేయించాలి. తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, క్యాప్సికమ్, క్యారెట్ వేసి కొద్దిసేపు వేగించాలి. కూరగాయలు కొద్దిగా మెత్తబడిన తర్వాత వేయించిన వేరుశెనగలు, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ముందుగా ఉడికించిన బార్లీని ఇందులో వేసి 2 నుంచి 3 నిమిషాలు ఉడికించాలి. దీంతో అన్ని రుచులు బాగా కలుస్తాయి. చివరగా నిమ్మరసం, కొత్తిమీర చల్లి మరోసారి కలిపితే వేడి వేడి బార్లీ ఉప్మా రెడీ. దీనిని పెరుగు లేదా మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేస్తే మరింత రుచిగా ఉంటుంది. రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందించే ఈ బార్లీ ఉప్మాను మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.
తాజావార్తలు
-
CM Chandrababu: “తక్షణమే ఆదుకోండి”.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖ
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి బంపర్ ఆఫర్.. ఆ సీనియర్ జట్టు కెప్టెన్‌గా బుడ్డోడి నియామకం
-
Kaka Release: ‘కాకా’ వెనక్కి తగ్గేదే లే.. రూమర్లకు ‘రెస్ట్ ఇన్ పీస్’ చెప్పిన కోన వెంకట్!
-
Kalyan Padala : బిగ్ బాస్ విన్నర్ హీరోగా ‘హారర్ కామెడీ’ మూవీ
-
Sandiyar First Look: ‘సండియార్’ ఫస్ట్ లుక్ చూశారా? రఫ్ అండ్ రా లుక్‌తో కమల్ విధ్వంసం!
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!