Sobhita: “నా జీవితాన్ని మార్చింది అదే..” శోభితా ధూళిపాళ్ల క్రేజీ కామెంట్స్ వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు అమ్మాయి శోభితా నటనతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె, తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ‘గూడాచారి’, ‘మేజర్’, ‘పొన్నియన్ సెల్వన్’ వంటి సినిమాలతో పాటు బాలీవుడ్, హాలీవుడ్ ప్రాజెక్ట్స్‌లో కూడా నటిస్తూ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. నటిగా మాత్రమే కాకుండా తన ఆలోచనలు, వ్యక్తిత్వంతో కూడా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు నెటిజన్ల మనసు గెలుచుకుంటున్నాయి.
పరిస్థితులు ఎలా ఉన్నా సరే, ఎప్పుడూ తన అంతరాత్మ (Inner Voice) చెప్పిన మాటనే వింటానని ఆమె స్పష్టం చేశారు.. ‘మనసు మాట విన్నప్పుడే నా జీవితంలో ఎన్నో అర్థవంతమైన క్షణాలను ఆస్వాదించాను.. మనసు మాట వినకుండా చేసిన ఏ పనీ నాకు కలిసి రాలేదు’ అంటూ ఆమె చేసిన రిప్లై ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. జీవితాన్ని నదిపై సాగే ఒక చిన్న ప్రయాణంతో పోల్చిన శోభిత, ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని, మనల్ని మనం గౌరవించుకోవాలని సూచించారు. ఇక వృత్తిపరమైన విషయానికి వస్తే, ఈ ఏడాది ప్రారంభంలో ‘చీకటిలో’ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించిన శోభిత, ప్రస్తుతం తన తదుపరి తమిళ చిత్రం ‘వెట్టువం’ (Vettuvam) పనుల్లో బిజీగా ఉన్నారు. స్టార్ డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వంలో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. వివాహం తర్వాత ఆమె నటిస్తున్న మొదటి తమిళ చిత్రం ఇదే కావడం విశేషం.
Also Read
- Samantha: పిల్లలు లేకపోయినా ఓకే అనుకున్నాం.. అదే సమయంలో ఈ గుడ్ న్యూస్.. ప్రెగ్నెన్సీపై సమంత షాకింగ్ కామెంట్స్!
- Ravi Mohan: ప్రియురాలిగా వార్తల్లో నిలిచిన కెనీషానే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్..
- Indian 3: కమల్ హాసన్ ‘ఇండియన్ 3’ని శంకర్ మళ్లీ మొదలు పెట్టబోతున్నారా ?
- Varun Tej Son: కొడుకు వాయువ్ ఫేస్ రివీల్ చేసిన వరుణ్ తేజ్.. క్యూట్‌నెస్‌కు ఫ్యాన్స్ ఫిదా!
తాజావార్తలు
-
Gold-Silver Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. 24K, 22K, 18K రేట్లు ఎంతంటే?
-
Assam Magic Rice: “మ్యాజిక్ బియ్యం”.. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్‌తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
-
BRICS Summit 2026: అష్టదిగ్బంధనంలో ఢిల్లీ.. మూడు రోజుల పాటు కఠిన ఆంక్షలు
-
BeiGo X4: 100KM రేంజ్‌తో కొత్త 3-వీలర్ EV.. ధర ఎంతో తెలుసా?
-
AP Weather Alert: ఇవాళ, రేపు వర్షాలే వర్షాలు.. ఉత్తరాంధ్ర జిల్లాలకు అలర్ట్
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!