Slumdog Husband Release date Poster Released: సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటించిన చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. చిన్న సినిమాగా మొదలైన ఈ సినిమాను రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ లాంటి పెద్ద సంస్థ రిలీజ్ చేయబోతుండడం గమనార్హం. మైక్ మూవీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించారు. ఇక బ్రహ్మాజీ, సప్తగిరి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ (జూలై 21) పోస్టర్‌ను హీరో సత్య దేవ్ విడుదల చేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో సత్యదేవ్ మాట్లాడుతూ.. ‘స్లమ్ డాగ్ హజ్బెండ్ కాన్సెప్ట్ నాకు ముందే తెలుసన్న ఆయన జ్యోతిలక్ష్మి టైంలోనే విన్నానని, పూరి దగ్గర మేం ఉన్న సమయంలో ఈ కథ తెలుసు కానీ ఇంత ఎంటర్టైనర్‌గా ఉంటుందని అనుకోలేదని అన్నారు. ఇక బ్రహ్మాజీ మాట్లాడుతూ నా కొడుకు హీరోగా ఎదిగినందుకు సంతోషంగా ఉందని, కానీ ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని అన్నారు. నా కొడుక్కి సపరేట్‌గా నేనేమీ సలహాలు ఇవ్వలేదు, ఈ తరంలో హీరోలు అందరూ సహజంగానే నటిస్తున్నారని అన్నారు. ముందుగా ఈ సినిమాలో ఓ పాత్ర కోసం నన్ను అప్రోచ్ అయ్యారని, తరువాత హీరోగా మా అబ్బాయిని తీసుకున్నారని అన్నారు.
SS Thaman: కావాలని ఫ్లాప్ సినిమాలు చేస్తారా? ‘గుంటూరు కారం’పై స్పందించిన థమన్
కథలు ఎంచుకోవడం, సినిమాలు సెలెక్ట్ చేసుకునే విషయంలో నేను నా కొడుక్కి ఎలాంటి సలహాలు ఇవ్వనన్న ఆయన నా కొడుకు మొదటి సినిమాకు చిరంజీవి గారు, మహేష్ బాబు గారు, ఎన్టీఆర్ గారు ముందుకు వచ్చి ప్రమోషన్స్ చేశారు. ఇలా ప్రతి సినిమాకు అలా అందర్నీ పిలవడం బాగుండదు, మొదటి సినిమాకు అందరూ ఆశీర్వాదం అందించారు, తర్వాత అన్ని సినిమాలు మన కష్టం మీద ఆధారపడి ఉంటుందని బ్రహ్మాజీ అన్నారు. ఇక డైరెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ ఈ సినిమాలో ‘హీరోయిన్ పాత్ర కోసం చాలా మందిని ఆడిషన్స్ చేశాను కానీ పక్కింటి అమ్మాయిలా ప్రణవి బాగా సెట్ అవుతుందని ఆమెను హీరోయిన్‌గా తీసుకున్నాం అని అన్నారు. ఈ సినిమాలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ ఉండదని పేర్కొన్న ఆయన డాగ్‌కు మేల్ వాయిస్ పెట్టాం కానీ అందులో ఓ ట్విస్ట్ ఉంటుందని అన్నారు. పూరి జగన్నాథ్ సర్ దగ్గర నేను అసిస్టెంట్‌గా పని చేసినప్పుడు ఆయన మనుషులకంటే జంతువులే విధేయంగా ఉంటాయని చెబుతూ ఉండేవారు, అలాగే ఐశ్వర్య రాయ్ చెట్టుని పెళ్లి చేసుకుంది, ఆ రెండు పాయింట్లను అల్లుకుని ఈ కథను రాసుకున్నానని ఆయన అన్నారు. సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటిస్తోన్న ఈ చిత్రం జూలై 21న విడుదల కాబోతోండగా బ్రహ్మాజీ, సప్తగిరి, ఛమ్మక్ చంద్ర, గుండు సుదర్శన్, ఫిష్ వెంకట్, తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.