SKN: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన SKN పేరే వినిపిస్తుంది. బేబీ సినిమాకు నిర్మాతగా మారి మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు SKN. మొదటి నుంచి మెగా ఫ్యామిలీకి.. ముఖ్యంగా అల్లు అర్జున్ కు వీరాభిమానిగా SKN అందరికి తెల్సిందే. ఎన్నో ఈవెంట్స్ లో బన్నీ కి ఎలివేషన్స్ ఇచ్చి అల్లు అభిమానుల చేత శభాష్ అనిపించుకున్న ట్రాక్ రికార్డ్ SKN ది. ఇక బేబీ సినిమా కోసం చాలా కష్టపడి విజయాన్ని అందుకున్నాడు. సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే కల్ట్ బొమ్మ అంటూ తొడగొట్టి ట్రోల్ మెటీరియల్ గా మారిపోయాడు. ముఖ్యంగా బేబీ సినిమాను హాలీవుడ్ సినిమాతో పోలుస్తూ మాట్లాడడం కొద్దిగా ఓవర్ యాక్షన్ అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. సాధారణంగా ఏ నటుడు, నిర్మాత, డైరెక్టర్ కు అయినా మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినా ఆనందం ఉంటుంది. ఎన్నో ఏళ్ళు కష్టపడితే దక్కిన విజయం కాబట్టి.. ఆ ఆనందంలో నిజాయితీ ఉంటుంది. ఎమోషనల్ అవుతారు . కానీ, మనోడు మాత్రం కొంచెం అతిగా మాట్లాడుతున్నాడు అని చాలామంది చెప్పుకొస్తున్నారు. ఇక తాజాగా బేబీ మూవీ అప్రిషియేషన్ మీట్ ను అల్లు అర్జున్ ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే.
Pushpa 2 Leak: పుష్ప 2 డైలాగ్ లీక్ చేసిన అల్లు అర్జున్
ఇక ఈ మీట్ లో SKN మరోసారి నోరుజారి ట్రోల్స్ బారిన పడ్డాడు. మొదటి నుంచి కూడా SKN.. హాలీవుడ్ సినిమా ఇంటర్ స్టెల్లర్ తో బేబీ సినిమాను పోలుస్తూ వస్తున్నాడు. ఈ మీట్ లో కూడా ఆయన మాట్లాడుతూ.. ఇంటర్ స్టెల్లర్ తీసిన స్టీవెన్ స్పీల్ బర్గ్ కూడా తన మొదటి సినిమాకు ఇంతే ఆనందపడి ఉంటాడు. నేను పదో సినిమ ఏదో అద్భుతం చేస్తాను అప్పుడు ఆనందపడతాను అని అనుకోడు.. మొదటి విజయం ఎవరికైనా సరే స్పెషల్ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఒక్క ముక్కతో మరోసారి SKN ట్రోల్ కంటెంట్ గా మారిపోయాడు. ఎందుకంటే.. ఇంటర్ స్టెల్లర్ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ కాదు క్రిస్టోఫర్ నోలన్. అది కూడా తెలియకుండా నీ సినిమాను.. ఆ సినిమాతో పోలుస్తున్నావా అంటూ ఏకిపడేస్తున్నారు. ఇంకొందరు మనోడికి ఆ టైటిల్ మాత్రమే తెలిసి ఉంటుంది.. సినిమా చూస్తే .. ఇలా మాట్లాడేవాడు కాదులే అని చెప్పుకొస్తున్నారు. ఇక ట్రోలర్స్అయితే .. అల్లు అర్జున్ ముందు పరువు పోయిందిగా.. ఎలా తలెత్తుకొనేది అని మీమ్స్ వేస్తున్నారు.