SKN: ఏం అన్నా.. యూట్యూబర్స్ ను హీరోయిన్లను చేసే ప్రోగ్రాం ఏమైనా పెట్టుకున్నావా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SKN: బేబీ సినిమాతో తెలుగుతెరకు నిర్మాతగా పరిచయమయ్యాడు SKN. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని స్టార్ ప్రొడ్యూసర్స్ లిస్ట్ లో చేరిపోయాడు. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన బేబీ సినిమాకు సాయి రాజేష్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమా కోసం SKN ఎంత కష్టపడింది ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా ఒక యూట్యూబర్ అయిన వైష్ణవి చైతన్యను హీరోయిన్ గా పరిచయం చేయడం మాములు విషయం కాదని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా కోసం ఆమె ఎంతో కష్టపడిందని, స్టార్ హీరోయిన్ అయ్యే లక్షణాలు ఆమెలో చాలా ఉన్నాయని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తన నెక్స్ట్ సినిమాలో కూడా SKN.. వైష్ణవినే హీరోయిన్ గా తీసుకున్నాడు. ఇక ఇప్పుడు మరో యూట్యూబర్ ను హీరోయిన్ గా లాంచ్ చేసే పని పెట్టుకున్నాడు. తాజాగా SKN తన మూడో సినిమాను ప్రకటించాడు.
Ram Gopal Varma: చూడు బేబీ.. నిన్ను చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు.. రాంగోపాల్ వర్మ
Also Read
- Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
- Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
- Peddi - Irumudi: 'పెద్ది' ఓడిపోయింది.. 'ఇరుముడి' గెలవలేకపోయింది!
- Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
సంతోష్ శోభన్, యూట్యూబర్ అలేఖ్య హారిక జంటగా సుమన్ పాతూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అమృత ప్రొడక్షన్స్ బ్యానర్ తో కలిసి SKN ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సాయి రాజేష్ కథను అందిస్తున్నాడు. తాజాగా నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. అక్కినేని నాగచైతన్య ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశాడు. ఇక ఈ పోస్టర్ లో సంతోష్, అలేఖ్య పెదవి ముద్దు పెడుతూ కనిపించారు. ఇక దీనికి కొన్ని ప్రేమకథలు జీవితాంతం వెంటాడుతూ ఉంటాయి అని చెప్పుకురావడం బేబీ సినిమాను గుర్తుచేస్తుంది. ఇక వైష్ణవి లానే అలేఖ్యను హీరోయిన్ గా లాంచ్ చేయడంపై అభిమానులు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఏం అన్నా.. యూట్యూబర్స్ ను హీరోయిన్లను చేసే ప్రోగ్రాం ఏమైనా పెట్టుకున్నావా..? అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో SKN ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.
After pouring in so much love for our #CultBlockbusterBaby, we are coming back with one more hard-hitting love story ❤️🔥 Me and SaiRajesh producing this written by SaiRajesh
Thank you yuva samrat @chay_akkineni garu for gracing and launching the first look of our next! ❤️
Happy… pic.twitter.com/av1IIQjv0b
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) October 30, 2023
తాజావార్తలు
-
Motorola Signature 27: మోటరోలా Signature 27 లాంచ్ డేట్ కన్ఫర్మ్.. 200MP కెమెరా, Dolby Vision సపోర్ట్, ప్రీమియం డిజైన్
-
PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
-
West Bengal Bypolls: మమతా బెనర్జీకి మరో షాక్.. రేజీనగర్ అభ్యర్థి కూడా బరి నుంచి ఔట్
-
Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
-
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!