Janta Movie: మెగా హీరో ‘జంట’ సెన్సేషనల్ క్యాప్షన్ వెనుక అసలు కథ ఇదే!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో మెగా కాంపౌండ్ నుంచి వచ్చే హీరోలకు ఉండే క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే కేవలం బ్యాక్ గ్రౌండ్ తోనే కాకుండా, వైవిధ్యమైన కథలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు యువ హీరో కొణిదెల పవన్ తేజ్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జంట’. వసుంధర ఆర్ట్స్ పతాకంపై రాజేష్ గునిశెట్టి, వీరు యాదవ్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ తాజాగా అమలాపురంలో జరిగింది. అయితే, ఈ కార్యక్రమం అంతటిలో అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించిన, టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం ఒకటుంది. అదే ఈ సినిమా క్యాప్షన్! “యుద్ధం రాముడితో కాదు రాజ్యంతో..” అంటూ పెట్టిన ఈ క్యాప్షన్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో సెన్సేషన్ సృష్టిస్తోంది. అసలు ఆ రాజ్యం ఏంటి? రాముడితో కాకుండా రాజ్యంతో హీరో చేసే ఆ యుద్ధం వెనుక ఉన్న బలమైన ఎమోషన్ ఏంటి? అన్నది నెట్టింట ఆసక్తికర చర్చకు దారితీసింది.
హీరో పవన్ తేజ్ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఈ క్యాప్షన్ చూసి ఇండస్ట్రీ నుంచి తనకు చాలా ఫోన్లు వస్తున్నాయని, ఇది పక్కా మాస్ ఎలిమెంట్స్ తో కూడిన ఎమోషనల్ యాక్షన్ డ్రైవ్ అని ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్పడం సినిమాపై అమాంతం అంచనాలు పెంచేసింది. ‘జంట’ టీమ్ మాత్రం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రా ప్రాంతంలో కూడా సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో, తమ సినిమా షూటింగ్ మొత్తం అమలాపురం బ్యాక్ డ్రాప్ లోనే రెండు నెలల పాటు నాన్-స్టాప్ గా చేయబోతున్నారు. పచ్చని పల్లెటూరి వాతావరణంలోకి ఒక యుద్ధం వస్తే ఎలా ఉంటుందో.. ఫైట్ మాస్టర్ గౌరీ శంకర్ డిజైన్ చేసిన కొత్త తరహా యాక్షన్ సీక్వెన్సులు ఈ సినిమాలో మెయిన్ హైలైట్ కానున్నాయి. దర్శకుడు రాజశేఖర్ యాదవ్ రెండేళ్ల పాటు శ్రమించి ఈ కథను ఒక రేంజ్ లో మలిచారని, ఈ ప్రాజెక్ట్ కోసం తాను వేరే ఆఫర్లు కూడా పక్కనపెట్టానని హీరో పవన్ తేజ్ వివరించాడు.
Also Read
- Love Story: అనిరుధ్ మామ కళానిధి మారన్ ప్రేమ కథ తెలుసా?
- Mouli: టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు దొంగ నా కొడుకు .. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ బ్యానర్లో మూడో సినిమా?
- Veeradhi Veerulu: మాస్ మహారాజా - శ్రీవిష్ణు కాంబో మిస్ అయినట్లేనా? ‘వీరాధి వీరులు’పై పిన్ డ్రాప్ సైలెన్స్!
- Keerthy Suresh: స్పెషల్ సాంగ్ నుంచి స్టార్ హీరోల దాకా.. పెళ్లి తర్వాత కీర్తి సురేష్ రేంజ్ మామూలుగా లేదుగా!
తాజావార్తలు
-
Janta Movie: మెగా హీరో ‘జంట’ సెన్సేషనల్ క్యాప్షన్ వెనుక అసలు కథ ఇదే!!
-
The Muslim 500 List 2027: ప్రపంచంలో టాప్-500 ముస్లింల జాబితా.. షారూఖ్‌తో సహా భారత్ నుంచి 22 మంది!
-
UP Congress-SP Alliance: 181 సీట్లు కోరుతున్న కాంగ్రెస్.. లీకైన జాబితాతో అఖిలేష్‌పై ఒత్తిడి!
-
Success Story: ఐఐటీ కుర్రాడి క్రేజీ బిజినెస్ ఐడియా.. కుల్దీప్ సక్సెస్ స్టోరీ కచ్చితంగా చదవాల్సిందే!
-
Fire Accident: చర్లపల్లి రైల్వే స్టేషన్లో అగ్నిప్రమాదం.. తగలబడిన బోగీలు..
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!