ప్రిన్స్ మహేశ్ బాబు పిల్లలు గౌతమ్, సితార లకు తాతయ్య కృష్ణ అంటే ఎంతో అభిమానం. వీరంతా కలిసి ఒకే ఇంటిలో ఉండకపోయినా, తరచూ జరిగే ఫ్యామిలీ గేదరింగ్స్ లో అంతా కలుస్తూ ఉంటారు. ఇక బర్త్ డేస్, స్పెషల్ అకేషన్స్, ఫెస్టివల్స్ లో కలిసి భోజనం చేయడం సర్వసాధారణం. అలాంటి సందర్భాలలో కృష్ణ కుమార్తె, మహేశ్ బాబు సోదరి మంజుల ఫోటోలను తీసి సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు. లేదంటే ఆ పనిని కృష్ణ చిన్నల్లుడు, నటుడు సుధీర్ బాబు చేస్తుంటాడు. అయితే ఇప్పుడు అదే పని మహేశ్, నమ్రత కుమార్తె సితార చేసింది.
కృష్ణతో దిగిన ఓ ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ, ‘తాతగారితో కలిసి భోజనం చేయడం అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రపంచంలోనే అత్యత్తమ తాత ఆయన’ అని పేర్కొంది. అలానే కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావుతో దిగిన ఫోటోనూ పోస్ట్ చేస్తూ, తాతయ్యను, చిన తాతయ్యను కూడా ఎంతో అభిమానిస్తున్నట్టు పేర్కొంది సితార!