జాక్ సినిమాతో దారుణమైన డిజాస్టర్ చూసాడు సిద్ధూ జొన్నలగడ్డ. అటు నిర్మాతకు కూడా భారీ నష్టాలు రావడంతో సిద్దు తన రెమ్యునరేషన్ లో కొంత వెనక్కి కూడా ఇచ్చాడు. ఇక జాక్ ను పూర్తిగా వదిలేసి బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. అందుకోసం గతంలో సితార బ్యానర్ తో చేతులు కలిపాడు. సితారతో గతంలో డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చేసిన సిద్దు ఇప్పుడు మరో సినిమా చేస్తున్నాడు. ఈ విషయాన్నీ తెలియజేస్తూ మిడిల్ ఫింగర్ మ్యాన్ అని ఓ పోస్టర్ ను రిలీజ్ చేసారు.
Also Read : Tollywood : లక్ అంటే ఇలా ఉండాలి.. జాక్ పాట్ కొట్టిన మైత్రీ మూవీ మేకర్స్
సిద్దు హీరోగా నటించిన కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాను డైరెక్ట్ చేసిన రవికాంత్ పేరేపు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ సినిమాకు ‘ బ్యాడాస్’ (BADASS) అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు సమాచారం. అలాగే కోలీవుడ్ సెన్సేషన్ అనిరుద్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. అందుకు సంబందించి ఈ నెల 9న అఫీషియల్ గా ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇదే కాంబోలో గతేడాది కోహినూర్ అనే సినిమాను ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ సినిమాను పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. ఇప్పుడు రాబోతున్నBADASS ‘సినిమా ప్రపంచం మరియు ఓ సినిమా స్టార్.. అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రాబోతున్నటు తెలుస్తుంది. జాక్ సినిమాతో పూర్తిగా పడిపోయిన సిద్ధూ మార్కెట్ ను ఈ సినిమాతో మళ్ళి నిలబెట్టుకోవాలని చుస్తున్నాడు సిద్దు. ఈ సినిమాకు సంబంధించి ఇతర నటీనటులు వివరాలు తెలియాల్సి ఉంది.