Siddu Jonnalagadda: సినిమా.. ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ గ్లామర్ ఉన్నవారే ఎక్కువగా పేరు తెచ్చుకుంటారు. అందం లేకుండా సినిమా ఇండస్ట్రీలో నెగ్గుకురాలేము.. ఇవన్నీ ఒకప్పటి మాటలు. ఇప్పుడు ప్రేక్షకులు ఇలాంటివి చూడడం లేదు. కథ, పాత్రను బట్టి క్యారెక్టర్స్ ను డిసైడ్ చేస్తున్నారు. పొట్టి, పొడుగు, కలర్, సిక్స్ ప్యాక్ ఇలాంటివి ఏవి చూడడం లేదు. ఇక ఇప్పుడున్న స్టార్ హీరోలు కూడా ఒకప్పుడు.. ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నవారే.. నీ ముఖం అద్దంలో చూసుకున్నావా అని అనిపించుకున్నవారే. అందులో నేను కూడా ఉన్నాను అని చెప్పుకొస్తున్నాడు డీజే టిల్లు. సిద్దు జొన్నలగడ్డ.. చిన్న చిన్న పాత్రల్లో కనిపించి మెప్పించిన సిద్దు.. గుంటూరు టాకీస్ చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమా సిద్దుకు మంచి పేరునే తీసుకొచ్చి పెట్టింది. ఇక డీజే టిల్లు సినిమాతో మనోడు స్టార్ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం డీజే టిల్లు కు సీక్వెల్ లో నటించడమే కాకుండా మరో రెండు సినిమాలు చేస్తున్నాడు. చిరంజీవి సినిమాలో కూడా సిద్దు నటిస్తున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు స్టార్ హీరోగా మారిన సిద్దు బాయ్ ను కూడా ఒకప్పుడు అవమానాలు వెంటాడాయి. ఈ విషయాన్నీ సిద్దు చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. తన ఫేస్ చూసి అస్సలు నువ్వు హీరో ఏంటి..? అని అవమానించేవారట.
Blood and Chocolate: శంకర్ ప్రొడక్షన్ లో రిలీజ్ కు రెడీ అయిన బ్లడ్ అండ్ చాక్లెట్
“నేను కెరీర్ మొదట్లో చాలా అవమానాలు ఎదుర్కొన్నాను. ముఖ్యంగా ఐదారేళ్ళ క్రితం.. నా ముఖం మీద ఉన్న మచ్చల గురించి ఒక ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి మాట్లాడిన మాటలు నన్ను ఇప్పటికి బాధపెడుతూ ఉంటాయి. నా ముఖం నిండా మొటిమలు ఉండేవి.. వాటి తాలూకు మచ్చలు, గుంతలు పడిపోయి అలాగే కనిపించేవి. ఇక వాటిని చూసి.. ముఖమంత బొక్కలు పెట్టుకొని హీరో ఎలా అవుదామని వచ్చావ్.. ? అని అడిగాడు. ఆ మాటలు నన్ను చాలా బాధపెట్టాయి. చాలా ఏడ్చాను. కానీ, ఏది శాశ్వతం కాదు ప్రయత్నిస్తే ఏదైనా సాధించగలం అని తెలుసుకున్నాను. ప్రయత్నించాను.. సక్సెస్ అయ్యాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సిద్దు వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.