Blood and Chocolate release date: లెజండరీ డైరెక్టర్ శంకర్ ప్రొడక్షన్స్ అయిన ఎస్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందిన ప్రేమిస్తే, వైశాలి, షాపింగ్ మాల్ లాంటి చిత్రాలు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ప్రస్తుతం ఇదే బ్యానర్ పై అర్జున్ దాస్ హీరోగా బ్లడ్ అండ్ చాక్లెట్ అనే సినిమాను నిర్మిస్తున్నారు. షాపింగ్ మాల్, ఏకవీర తదితర సెన్సిబుల్ సినిమాలు రూపొందించి, జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకున్న వసంతబాలన్ ఈ సినిమాకు డైరెక్టర్ గా వహిస్తున్నారు. ఖైదీ, మాస్టర్, విక్రమ్ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందిన అర్జున్ దాస్ హీరోగా, దుసరా విజయన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
Gaandeevadhari Arjuna: ‘గాంఢీవధారి అర్జున’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా జూలై 21న ఎస్.ఆర్ డి.ఎస్ సంస్థ విడుదల చేయనుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ ను తాజాగా దర్శక, నిర్మాతలు విడుదల చేశారు. ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ నాలుగు అద్భుతమైన పాటలు అందించారు. జీవి ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని దర్శకుడు వసంతబాలన్ చెబుతున్నారు. తమిళ మాస్టర్, ఖైదీ, విక్రమ్ సినిమాలతో బాగా పాపులర్ అయ్యాడు అర్జున్ దాస్. వాయిస్ గంభీరంగా ఉండటంతో అతని వాయిస్ తో కూడా బాగా పాపులర్ అవడంతో మలయాళ సినిమా కప్పేలా రీమేక్ గా తెలుగులో తెరకెక్కిన బుట్టబొమ్మ సినిమాతో డైరెక్ట్ తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు.