Siddarth : అలాంటి విషయాల్లో తన ఆనందాన్ని వెతుక్కుంటాను అంటున్న సిద్దార్థ్..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బొమ్మరిల్లు సినిమా అంటే లవర్ బాయ్ సిద్దార్థ్ గుర్తుకువస్తారు. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు ఆయన.తాజాగా టక్కర్ సినిమాతో మళ్లీ మన ముందుకు రాబోతున్నాడని సమాచారం. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తను డబ్బుకు ప్రాధాన్యం ఇవ్వనని చెప్పుకొచ్చాడు . డబ్బు ఉంటేనే సంతోషంగా ఉంటామనే కాన్సెప్ట్ కు తాను పూర్తి వ్యతిరేకం అని చెబుతున్నాడు.చిన్న చిన్న విషయాల్లో కూడా తను ఆనందం వెదుక్కుంటానని కూడా అంటున్నాడు. “ఈ తరంలో డబ్బు సంపాదించాలనే ఆశ ఎక్కువగా అయితే కనిపిస్తోంది. సెలబ్రిటీల విపరీత సంపాద న అందరికీ కూడా తెలిసిందే. అయితే, నేను పెరిగిన విధానం మాత్రం వేరు. డబ్బు కంటే ఆనందానికి ప్రాధాన్యత ఇవ్వాలనేది నా ఉద్దేశం . మ్యూజిక్ తో పాటు, చిన్న చిన్న విషయా ల్లో నేను నా ఆనందాన్ని వెతుక్కుంటాను. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న రోజుల్లో నాకు కేవలం 2 వేలు మాత్రమే ఇచ్చేవారు.
అందులోంచి పెట్రోల్ కు 160 రూపాయలు అయితే అయిపోయేవి. అయినా అప్పుడు నేను ఆనందంగా నే ఉన్నాను. నేను సాధారణ విషయాల్లో ఆనందం, సంతృప్తి ని పొందుతాను. కోరుకున్నప్పుడల్లా ప్రశాంతంగా నేను నిద్రపోతాను. కాలేజీ రోజుల్లో నాటి పాత దుస్తులనే ఇప్పటి కీ కూడా ధరిస్తున్నాను.”ఇలా తను డబ్బుకు ప్రాధాన్యం ఇవ్వననే విషయాన్ని బయటపెట్టాడు సిద్దార్థ్. ఎప్పటికీ గుర్తిండిపోయే చిత్రాన్ని రూపొందించాలనేది తన డ్రీమ్ అని.. అదే తన డ్రీమ్ ప్రాజెక్టు అని కూడా తెలిపాడు. తన డ్రీమ్ ప్రాజెక్టుకు ‘చిన్నా’ అనే టైటిల్ కూడా పెట్టాడు. దీంట్లో నటించడంతో పాటు, స్వయంగా తనే నిర్మిస్తాడని సమాచారం.ఆ సినిమాతో ఎన్నో అవార్డులు, ప్రశంసలు కూడా అందుకుంటాన ని నమ్మకంగా చెబుతున్నాడు సిద్దార్థ్. ఈ హీరో నటించిన టక్కర్ సినిమా విడుదలకు రెడీ అయింది . ఈ శుక్రవారం థియేటర్లలోకి రాబోతుంద ని సమాచారం.
Also Read
- Tags
- #takker
- bommarillu
- Siddarth
తాజావార్తలు
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
Ramayana Part 1 Title: రణ్బీర్ కపూర్ బర్త్డే సర్ప్రైజ్.. ‘రామాయణ’ పార్ట్ 1 టైటిల్ ఇదే!
-
Share Nani: ఒక్క సినిమాకే సరిపోయింది.. మళ్లీ ‘నేచురల్ స్టార్’గానే నాని!
-
Gold Silver Price Today: పడిపోతున్న పసిడి ధర.. వరుసగా రెండో రోజూ భారీగా డౌన్
-
12.1 అంగుళాల 3K డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
October 2026 Rule Changes: అక్టోబర్లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!