Sonam Wangchuk Hunger Strike: 20వ రోజుకు సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష.. అవయవ వైఫల్యం ముప్పు.. దీక్ష విరమణకు ససేమిరా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sonam Wangchuk Hunger Strike: నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్ష 20వ రోజుకు చేరుకుంది. జూన్ 28 నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆయన ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. అయితే రోజురోజుకూ ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండటంతో వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత ప్రమాదకర దశలోకి చేరుకుందని, తక్షణ చర్యలు తీసుకోకపోతే అవయవాల పనితీరు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
వైద్యుల వివరాల ప్రకారం, నిరాహార దీక్ష ప్రారంభమైనప్పటి నుంచి సోనమ్ వాంగ్‌చుక్ 9 కిలోగ్రాములకు పైగా బరువు కోల్పోయారు. ప్రస్తుతం ఆయన బరువు కేవలం 56.9 కిలోగ్రాములకు పడిపోయింది. డాక్టర్ సతీష్ లంబా తెలిపిన వివరాల ప్రకారం, శరీరానికి ఆహారం అందకపోవడంతో మొదట గ్లూకోజ్, తర్వాత కొవ్వు నిల్వలను వినియోగించిన శరీరం ఇప్పుడు కండరాలను కూడా శక్తి కోసం వినియోగించడం ప్రారంభించింది. దీంతో కండరాలు వేగంగా క్షీణిస్తున్నాయని, యూరిక్ యాసిడ్ స్థాయిలు కూడా గణనీయంగా పెరిగాయని ఆయన వెల్లడించారు.
Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
వాంగ్‌చుక్ పరిస్థితి తీవ్రంగా క్షీణించిందని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఎముకలు స్పష్టంగా కనిపించేంతగా బలహీనపోయారని, స్వయంగా నడవలేని స్థితికి చేరుకున్నారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక, ఈ వ్యవహారంపై ఢిల్లీ హైకోర్టు కూడా స్పందించింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన కోర్టు, సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యాన్ని ప్రతిరోజూ వైద్యుల ద్వారా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించింది. ఒకవేళ ఆరోగ్యం మరింత విషమిస్తే వెంటనే అవసరమైన వైద్యం అందించాలని స్పష్టం చేసింది. ప్రతి పౌరుడి ప్రాణం విలువైనదని, దానిని కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని కోర్టు పేర్కొంది. కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాల తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవించారు.
అయితే వైద్యుల హెచ్చరికలు, కోర్టు సూచనలు ఉన్నప్పటికీ సోనమ్ వాంగ్‌చుక్ మాత్రం తన దీక్షను విరమించేందుకు సిద్ధంగా లేరు. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ ఆయన వీడియో సందేశం విడుదల చేశారు. జూలై 20న పార్లమెంట్ వరకు చేపట్టనున్న పాదయాత్రను మరింత విజయవంతం చేయాలని తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. ఈ ఉద్యమాన్ని ప్రజాస్వామ్య విలువలు, రాజకీయ అవగాహనకు ప్రతీకగా చూడాలని విద్యార్థులకు సూచించారు. సోనమ్ వాంగ్చుక్కు పలువురు ప్రముఖులు మద్దతుగా నిలుస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ జంతర్ మంతర్‌కు వెళ్లి ఆయనను పరామర్శించారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్లను, వాంగ్‌చుక్ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. సంగీత దర్శకుడు విశాల్ దద్లానీ, నటి సోనాక్షి సిన్హా, రచయిత్రి శోభా దే, మహారాష్ట్ర రాజకీయ నాయకుడు రాజ్ థాకరేతో పాటు పలువురు సామాజిక కార్యకర్తలు కూడా ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (SCBA) కూడా లేఖ రాసి, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిరాహార దీక్షను విరమించాలని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రభుత్వం, వైద్యులు, న్యాయస్థానం, ప్రముఖుల విజ్ఞప్తుల మధ్య ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!