Sid Sriram’s song in Mechanic got 7 Million Views: టీనా శ్రీ క్రియేషన్స్ బ్యానర్ పై మణి సాయి తేజ, రేఖ నిరోషా హీరో హీరోయిన్లుగా నాగ మునెయ్య(మున్నా) నిర్మాతగా ముని సహేకర దర్శకత్వం వహిస్తూనే రచన కూడా చేసిన మూవీ “మెకానిక్”. ట్రబుల్ షూటర్ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెన్సార్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలో విడుదలకు సిద్ధమవుతోన్న ఈ సినిమా కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాట “నచ్చేసావే పిల్లా నచ్చేసావే” అనే సాంగ్ ఇంటర్నెట్ లో 70 లక్షల వ్యూస్ సాధించింది. ఈ క్రమంలో నిర్మాత నాగ మునెయ్య(మున్నా) మాట్లాడుతూ వినోద్ యాజమాన్య అందించిన సంగీతం మా చిత్రానికి హైలైట్ అని సిద్ శ్రీరామ్ పాడిన పాట “నచ్చేసావే పిల్లా నచ్చేసావే” ఇంటర్నెట్ లో దూసుకు పోయిందని అన్నారు.
Animal : రశ్మికతో రణబీర్.. మోస్ట్ వయిలెంట్ ఫస్ట్ నైట్ ప్లాన్ చేశారట!
యూట్యూబ్ లో 70 లక్షల వ్యూస్ మరియు ఇంస్టాగ్రామ్ లో 10 కోట్ల వ్యూస్ తో దూసుకుపోతుందని పేర్కొన్న ఆయన ఇంతకు ముందు విడుదల అయిన ‘టూలేట్ బోర్డు ఉంది నీ ఇంటికి’ అనే పాటని కూడా 16 లక్షల మంది యూట్యూబ్ లో వీక్షించారని అన్నారు. మా మెకానిక్ సినిమా విడుదల కాక ముందే మంచి మ్యూజికల్ హిట్ అయినందుకు సంతోషంగా ఉందని, మా సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. త్వరలో సెన్సార్ కు పంపించి విడుదల తేదీని ప్రకటిస్తామని అన్నారు. తనికెళ్ల భరణి, నాగ మహేష్, సూర్య, సమ్మెట గాంధీ, కిరీటి, ల్యాబ్ శరత్, మాస్టర్ చక్రి, ,వీర శంకర్ ,జబర్దస్త్ దొరబాబు, సునీత మనోహర్, సంధ్యా జనక్ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాకి వినోద్ యాజమాన్య సంగీతం అందించారు.