దేవుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ పాపులర్ బ్యూటీ ఇప్పుడు చిక్కుల్లో పడింది. టీవీ నటి శ్వేతా తివారీ హిందూ మనోభావాలను దెబ్బతీశారని నెటిజన్లు మండిపడుతున్నారు. శ్వేతా తివారీ బుధవారం భోపాల్ విలేకరుల సమావేశంలో తన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా ఇబ్బందుల్లో పడింది. 41 ఏళ్ల ఈ బ్యూటీ తన రాబోయే వెబ్ సిరీస్ ‘షోస్టాపర్’ ప్రమోషన్ కోసం సహనటుడు రోహిత్ రాయ్‌తో కలిసి బుధవారం భోపాల్‌లో ప్రెస్ మీట్ లో పాల్గొంది. ఈ వెబ్ సిరీస్‌లో తెలుగు స్టార్ దిగంగనా సూర్యవంశీ, ‘మహాభారతం’ ఫేమ్ నటుడు సౌరభ్ రాజ్ జైన్ కూడా కీలక పాత్రల్లో నటించారు.
Read also : ‘సలార్’ అప్డేట్… ఆద్యను పరిచయం చేసిన టీం
‘షోస్టాపర్’ ప్రమోషన్ కార్యక్రమంలో శ్వేతా తివారీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. భోపాల్‌లోని శ్యామలా హిల్స్ పోలీస్ స్టేషన్‌లో శ్వేతా తివారీపై ఐపిసి సెక్షన్ 295 (ఎ) కింద కేసు నమోదైంది. ఈ ఎఫ్‌ఐఆర్‌ను మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా చేశారు. ఈ సందర్భంగా మిశ్రా మాట్లాడుతూ ‘నేనే స్వయంగా శ్వేతా తివారీ నోటి నుంచి ఆ మాటలు విన్నాను. నేను దానిని వ్యతిరేకిస్తున్నాను. ఈ విషయంపై విచారణ జరిపి 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని భోపాల్ పోలీస్ కమిషనర్‌ను కోరాను. ఆ తర్వాత నటిపై చర్యలు తీసుకోనున్నారు” అని తెలిపారు.
स्वेता तिवारी के इस बयान के पीछे की कहानी मैं बताता हूं क्योंकि मैं वहां मौजूद था और श्वेता से बातचीत भी हुई थी.
— Piyush Parmar (@ItsPiyushParmar) January 27, 2022
हुआ यूं कि सौरभ राज जैन जिन्होंने महाभारत सीरियल में कृष्ण का रोल निभाया है वो इस show में Brafitter बनेंगे तो
Thread-1/2@shwetatiwarione#Showstopper #ShwetaTiwari pic.twitter.com/wM0cHD4Mb4
अभिनेत्री #ShwetaTiwari के विवादित बयान को लेकर भोपाल में IPC की धारा 295 A के तहत मुकदमा दर्ज हुआ है।
— Dr Narottam Mishra (@drnarottammisra) January 28, 2022
आगे की कार्रवाई नियमानुसार की जाएगी। pic.twitter.com/PyrWiQOX40