కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ఇప్పుడిప్పుడే అమ్మడు కొత్త జీవితం ప్రారంభిస్తుంది. కొన్నేళ్ల క్రిత్రం శృతిహాసన్ మేఖేల్ కోర్సల్ తో డేటింగ్ చేసి విడిపోయిన సంగతి తెలిసిందే. ఆ బ్రేకప్ తరువాత శృతి కొంత గ్యాప్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత క్రాక్ తో హిట్ అందుకొని బౌన్స్ బ్యాక్ అయిన ఈ బ్యూటీ ఇటీవలే శంతను హజారికతో సహజీవనం చేయడం మొదలుపెట్టింది. లాక్ డౌన్ సమయంలో ముంబైలో వీరిద్దరు ఒకే ఇంట్లో కలిసి ఉన్నారన్న విషయం విదితమే. శంతను కు తమిళ్ వంటలను పరిచయం చేసి, తమిళియన్ గా మార్చేయడానికి ప్రయత్నిస్తుంది. శంతను చెంతన ఉంటే బాధ అనేదే ఉండదు అని చెప్పుకొస్తున్న అమ్మడు త్వరలోనే పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతుంది అనుకుంటే.. పెళ్లి ఏంటీ ..? అని అనేసి అందరికి షాక్ ఇచ్చింది.
ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో శృతి పెళ్లిపై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. శంతను గురించి గొప్పగా చెప్పుకొచ్చేస్తున్నారు.. మరి ఇద్దరి పెళ్లి ఎప్పుడు అని అడిగితే.. పెళ్లి లేదు,గిళ్లి లేదు.. పెళ్లి ప్రస్తావన తీసుకురాకండి అని చెప్పుకొచ్చింది. పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదని, లివింగ్ రిలేషనే బావుందని చెప్పుకొచ్చింది. అంటే శృతికి లివింగ్ ఓకే కానీ పెళ్లి నాట్ ఓకే అని అర్ధమవుతుంది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ప్రస్తుతం శృతి హాసన్ సలార్, బాలకృష్ణ- గోపీచంద్ మలినేని మూవీలో నటిస్తుంది.