Bhoothaddam Bhaskar Narayana Title Song: యంగ్ హీరో శివ కందుకూరి హీరోగా భూతద్ధం భాస్కర్ నారాయణ సినిమా తెరకెక్కుతోంది. స్నేహాల్ .. శశిధర్, కార్తీక్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. రాశి సింగ్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అరుణ్ కుమార్, దేవి ప్రసాద్, వర్షిణి సౌందరరాజన్, శివ కుమార్, షఫీ, శివన్నారాయణ, కల్పలత ఇతర కీలక పాత్రలు పోషించారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంగా రూపొందిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ మధ్య రిలీజ్ అయినా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కూడిన టీజర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచింది. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు న్యూ ఏజ్ స్టార్ కంపోజర్ శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
ఇక తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. శివ ట్రాన్స్ అనే పేరుతో రిలీజ్ అయిన ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శివుడి గురించి తెలుపుతూ.. సాగిన ఈ సాంగ్ లిరిక్స్ చైతన్య ప్రసాద్ రాయగా.. కాల భైరవ అద్భుతంగా ఆలపించాడు. ఒకపక్క లిరిక్స్ శివున్నీ గుర్తుచేస్తుండగా.. ఇక వీడియోలో శివుని విజువలైజెషన్ మరింత ఆకట్టుకుంటుంది. కాల భైరవ ఈ సాంగ్ ను ప్రాణం పెట్టి పాడినట్లు కనిపిస్తున్నాడు. నరబలుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇకపోతే ఈ చిత్రం మార్చి 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో శివ కందుకూరి ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.