Naga Shaurya: యంగ్ హీరో నాగశౌర్య నిన్న సెట్ లో కళ్ళు తిరిగి పడిపోయిన విషయం విదితమే. సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేస్తూ డైట్ ఫాలో అవుతున్న శౌర్య డీ హైడ్రేషన్ కు గురి కావడంతో కళ్ళు తిరిగిపడిపోయాడని వైద్యులు తెలిపారు. నిన్నటి నుంచి శౌర్య ఇంకా హాస్పిటల్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. డీ హైడ్రేషన్ అని చెప్పిన వైద్యులు.. ఇంకా శౌర్యను డిశ్చార్జ్ చేయలేదు. దీంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. మరో ఐదు రోజుల్లో ఈ హీరో పెళ్ళికి రెడీ అవుతున్నాడు. కర్ణాటకకు చెందిన బిజినెస్ విమెన్ అనూష తో శౌర్య పెళ్లి ఈ నెల 20 న జరగబోతున్న విషయం విదితమే.
ఇక పెళ్లి అంటే పూజలు, ఉపవాసాలు ఉండాలి. ఇలాంటి సమయంలో శౌర్యకు ఇలా కావడం ఆందోళన చెందాల్సిన విషయమే అంటున్నారు. హీరోఇజం చూపించడానికి డైట్, జిమ్ అంటూ కష్టమైన కసరత్తులు, తిండి మానేయడం ఇలాంటివన్నీ కుర్ర హీరోలు తగ్గించుకొంటే బెటర్ అని చెప్పుకొస్తున్నారు. కథ బావుంటే హీరో ఎలా ఉన్నా ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారని ఇటీవల వచ్చిన సినిమాలు నిరూపించాయి. ఇలాంటి రిస్కులు తీసుకొని ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని అభిమానులు సలహా ఇస్తున్నారు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం రేపు శౌర్యను డిశ్చార్జ్ చేస్తారట. మరి ఇప్పుడైనా ఈ హీరో కొద్దిగా ఇవన్నీ మానేసి పెళ్ళికి గట్టిగా తిని కొత్త జీవితంలోకి అడుగుపెట్టమని అభిమానులు చెప్పుకొస్తున్నారు.