బాయ్కాట్ బాలీవుడ్ ట్రెండ్ దెబ్బకి హిందీ చిత్ర పరిశ్రమ కోలుకోలేని దెబ్బ తింటోంది. ఈ ట్రెండ్ కి తోడు ఒక్క బాలీవుడ్ స్టార్ హీరో కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమా చెయ్యట్లేదు. అన్ని రొటీన్ సినిమాలని చేసి ఆడియన్స్ పైకి వదిలేస్తే వాళ్లు మాత్రం ఎందుకు చూస్తారు? వందలు ఖర్చు పెట్టి చెత్త సినిమా చూడాలి అని ఎవరు అనుకోరు కదా. ఇతర ఇండస్ట్రీల్లో సూపర్ హిట్ అయిన సినిమాలని హిందీలో రీమేక్ చేసి హిట్ కొట్టేదాం అనే ఆలోచన కూడా బాలీవుడ్ కి కష్టాలు తెస్తుంది. సరైన సొంత కథతో సినిమా చెయ్యడం అక్కడి మేకర్స్ దాదాపుగా మర్చిపోయినట్లు ఉన్నారు. పైగా ఓటీటీల పుణ్యమాని కావల్సినంత కంటెంట్ భాషతో సంబంధం లేకుండా దొరికేస్తుంది. మంచి కంటెంట్ ఉంటే ఏ లాంగ్వేజ్ సినిమా, సిరీస్ అయినా చూసేస్తున్న ఆడియన్స్, ఒక యావరేజ్ కంటెంట్ కోసం థియేటర్ కి వచ్చే పరిస్థితి లేదు. కంటెంట్ సమస్యతో పాటు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోవడానికి బాలీవుడ్ లోని నెపోటిజం ప్రధాన కారణం అని ప్రతి నార్త్ ఆడియన్స్ నమ్ముతున్నారు. ఇలాంటి సమయంలో ఒక సినిమా రిలీజ్ అయ్యి ఆడియన్స్ ని మెప్పించాలి అంటే చాలా కష్టమైన పని. అందుకే గత రెండేళ్లలో బాలీవుడ్ నుంచి వచ్చిన హిట్ సినిమాలు చాలా తక్కువ.
బాలీవుడ్ డౌన్ ట్రెండ్ ఇలానే కంటిన్యు అయితే హిందీ చిత్ర పరిశ్రమ మరింత ఇబ్బంది పడుతుంది. బాలీవుడ్ కష్టాలకి ఎండ్ కార్డ్ వేసే ఓన్లీ హాప్ లా కనిపిస్తున్నాడు కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. మూడున్నర దశాబ్దాలుగా ఫేస్ ఆఫ్ బాలీవుడ్ లా, ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా వెస్ట్రన్ కంట్రీస్ లో పేరు తెచ్చుకున్న షారుఖ్ ఖాన్, ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘పఠాన్’. జనవరి 25న ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ పై బాలీవుడ్ లో భారి అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకి తగ్గట్లే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా పీక్ స్టేజ్ లో జరుగుతున్నాయి. ఇప్పటివరకూ పఠాన్ సినిమాకి ఆల్మోస్ట్ మూడు లక్షల టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో వచ్చాయి. జస్ట్ మల్టీప్లెక్స్ చైన్స్ లోనే ఇలా ఉంటే డైరెక్ట్ వాకిన్స్, సింగల్ స్క్రీన్స్ విషయంలో షారుఖ్ ఇంపాక్ట్ ఏ రేంజులో ఉండబోతుందో అర్ధం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలలోని A సెంటర్స్ లో కూడా షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ మూవీ మంచి ఓపెనింగ్స్ ని రాబట్టడం గ్యారెంటీగా కనిపిస్తోంది. హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో హైయెస్ట్ ఓపెనింగ్ డే రికార్డ్ ని క్రియేట్ చెయ్యడానికి షారుఖ్ ఖాన్ రెడీగా ఉన్నాడు, పాజిటివ్ కూడా స్ప్రెడ్ అయ్యి పఠాన్ మూవీకి లాంగ్ రన్ దొరికితే బాలీవుడ్ కష్టాలకి ఎండ్ కార్డ్ పడినట్లే అవుతుంది. మరి పఠాన్ బాక్సాఫీస్ దగ్గర చెయ్యబోయే ర్యాంపేజ్ బాలీవుడ్ ని సేవ్ చేస్తుందో లేదో చూడాలి.