బాలీవుడ్ బాక్సాఫీస్ కా బాద్షా షారుఖ్ ఖాన్ కంబ్యాక్ ఇస్తూ నటించిన సినిమా ‘పఠాన్’. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ నుంచి బయటకి వచ్చిన ఈ మూవీ ఫస్ట్ డే మార్నింగ్ షో నుంచే అదిరిపోయే రెస్పాన్స్ ని తెచ్చుకుంటుంది. బాలీవుడ్ క్రిటిక్ ‘తరన్ ఆదర్శ్’ పఠాన్ మూవీకి 4.5 రేటింగ్స్ ఇచ్చాడు. షారుఖ్ సాలిడ్ గా బౌన్సు బ్యాక్ అయ్యాడు అంటూ పఠాన్ సినిమా చూసిన వాళ్లు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతుంటే… కొంతమంది…
2018లో వచ్చిన ‘జీరో’ సినిమా తర్వాత కింగ్ ఖాన్ షారుఖ్ పూర్తి స్థాయిలో సినిమా చెయ్యలేదు. ఇతర హీరోల సినిమాల్లో క్యామియో రోల్స్ ప్లే చేశాడు కానీ షారుఖ్ సోలో సినిమా మాత్రం చెయ్యలేదు. ఇదే సమయంలో బాలీవుడ్ కూడా కష్టాల్లోకి వెళ్లిపోవడంతో, షారుఖ్ లాంటి స్టార్ హీరో కంబ్యాక్ ఇచ్చే వరకూ బాలీవుడ్ కష్టాలు తీరవు అనే ఫీలింగ్ అందరిలోనూ కలిగింది. ఎట్టకేలకు దాదాపు అయిదేళ్ల తర్వాత షారుఖ్ ‘పఠాన్’ మూవీతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు.…
బాయ్కాట్ బాలీవుడ్ ట్రెండ్ దెబ్బకి హిందీ చిత్ర పరిశ్రమ కోలుకోలేని దెబ్బ తింటోంది. ఈ ట్రెండ్ కి తోడు ఒక్క బాలీవుడ్ స్టార్ హీరో కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమా చెయ్యట్లేదు. అన్ని రొటీన్ సినిమాలని చేసి ఆడియన్స్ పైకి వదిలేస్తే వాళ్లు మాత్రం ఎందుకు చూస్తారు? వందలు ఖర్చు పెట్టి చెత్త సినిమా చూడాలి అని ఎవరు అనుకోరు కదా. ఇతర ఇండస్ట్రీల్లో సూపర్ హిట్ అయిన సినిమాలని హిందీలో రీమేక్ చేసి హిట్…