కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హిట్ కొడితే ఎలా ఉంటుందో ‘పఠాన్’ సినిమా నిరూపించింది. అయిదేళ్లుగా సినిమా చేయకపోయినా, పదేళ్లుగా హిట్ అనేదే లేకపోయినా షారుఖ్ క్రేజ్ ఇంచ్ కూడా తగ్గదని పఠాన్ సినిమా ఘనంగా చాటింది. 1000 కోట్లు వసూల్ చేసి ట్రేడ్ వర్గాలు కూడా షాక్ అయ్యే రేంజ్ కింగ్ సైజ్ కంబ్యాక్ ఇచ్చిన షారుఖ్ ఖాన్, 2023లో మరోసారి బాక్సాఫీస్ ని రఫ్ఫాడించడానికి వస్తున్నాడు. తన కంబ్యాక్ రీసౌండ్ వచ్చే రేంజులో వినిపించిన షారుఖ్ ఖాన్ ప్రస్తుతం ‘జవాన్’ సినిమా చేస్తున్నాడు. సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ తోనే భారి అంచనాలు ఏర్పడ్డాయి. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న జవాన్ సినిమా షూటింగ్ పార్ట్ రీసెంట్ గా కంప్లీట్ అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ని స్పీడప్ చేసి జూన్ 2కే జవాన్ సినిమాని రిలీజ్ చెయ్యాలనేది మేకర్స్ ప్లాన్. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే జవాన్ సినిమా ఈరోజు థియేటర్స్ లోకి వచ్చి ఉండేది.
ఇండియన్ బాక్సాఫీస్ ఈరోజు కొత్త ఓపెనింగ్ డే రికార్డ్స్ ని చూసేది. పోస్ట్ ప్రొడక్షన్ లో డిలే కారణంగా జవాన్ సినిమా సెప్టెంబర్ 7కి వాయిదా పడింది. అది కూడా రీసెంట్ గానే 18 సెకన్ల పాటు ఒక చిన్న గ్లిమ్ప్స్ ని విడుదల చేసి సెప్టెంబర్ 7వ తేదీన విడుదల చేయబోతున్నట్టు అనౌన్స్ చేసారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైనర్‌పై గౌరీ ఖాన్ నిర్మిస్తున్న ఈ సినిమాను హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఇదొక క్రేజీ కాంబో కావడం, షారుఖ్ డబుల్ రోల్ ప్లే చేస్తుండడం, పఠాన్ సినిమా వెయ్యి కోట్లు వసూల్ చేయడంతో జవాన్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలని అట్లీ, షారుఖ్ ఖాన్ లు ఎంతవరకు అందుకుంటారో చూడాలి.