కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ స్పై యాక్షన్ మూవీ జనవరి 25న ఆడియన్స్ ముందుకి రానుంది. బాలీవుడ్ కష్టాలని తీర్చే సినిమాగా ట్రేడ్ వర్గాలు చెప్పుకుంటున్న పఠాన్ సినిమాలో దీపిక పదుకోణే హీరోయిన్ గా నటిస్తోంది. జాన్ అబ్రహం విలన్ గా నటిస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని ఫుల్ స్వింగ్ లో చేస్తున్నారు. గత ఆరేడేళ్ళుగా హిట్ అనే మాటకి చాలా దూరంగా ఉంటున్న షారుఖ్ ‘పఠాన్’ మూవీతో సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. అందుకే పఠాన్ సినిమాని చాలా అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నాడు.
Read Also: Unstoppable: బాలయ్యతో మెగా మామ-అల్లుడు
యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందిన పఠాన్ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా రిలీజ్ చెయ్యనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అంటే పాన్ ఇండియా రేంజులో ప్రమోషన్స్ కూడా ఉండాలి, ప్రతి ఏరియా తిరగాలి. ఈ విషయంలో షారుఖ్ ఖాన్ కి ఒక కండీషన్ ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తోడు వస్తే జనవరి 25న తెలుగు రాష్ట్రాల్లోని ఏదైనా థియేటర్ కి వస్తాను అంటున్నాడు. చరణ్, షారుఖ్ ఖాన్ ల మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఈ స్నేహం కారణంగా షారుఖ్ కండీషన్ ని చరణ్ కన్సిడర్ చేస్తే తెలుగు రాష్ట్రాల్లో కింగ్ ఖాన్ ప్రమోషన్స్ చెయ్యడం చూసే ఛాన్స్ దొరుకుతుంది.
Yeah if Ram Charan takes me!! https://t.co/LoaE4POU79
— Shah Rukh Khan (@iamsrk) January 21, 2023
Read Also: Pataan: బాలీవుడ్ కష్టాలకి ఎండ్ కార్డ్ వేస్తున్న బాద్షా…