Sekhar Suri to direct Laksh 08 Soon:’ఏ ఫిల్మ్ బై అరవింద్’ ఫేమ్ శేఖర్ సూరి మరో తెలుగు సినిమా చేసేందుకు సిద్ధం అయ్యారు. టాలీవుడ్ యంగ్ హీరో లక్ష్ చదలవాడతో కలిసి ఆయన ఒక సినిమా చేస్తున్నారు. వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు వంటి సినిమాలతో లక్ష్ ప్రస్తుతం ఫుల్ స్పీడు మీదున్నారు. మరికొద్ది రోజుల్లో ధీర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక తాజాగా లక్ష్ బర్త్ డే సందర్భంగా ధీర నుంచి అదిరిపోయే గ్లింప్స్‌ను మేకర్లు రిలీజ్ చేశారు. ఈ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉండగానే మరో వైపు కొత్త ప్రాజెక్ట్‌కు లక్ష్ ఓకే చెప్పేశారు. లక్ష్ 8వ సినిమాగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ కాన్సెప్ట్ పోస్టర్‌ను సైతం రిలీజ్ చేశారు.
Kingston: ఇండియన్ ఫస్ట్ సీ-హారర్ ఫిలింగా ‘కింగ్ స్టన్’
ఈ సినిమాకు ‘ఏ ఫిల్మ్ బై అరవింద్’ ఫేమ్ శేఖర్ సూరి దర్శకత్వం వహిస్తుండగా ని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్ మీద పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ కాన్సెప్ట్ పోస్టర్ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోందనే చెప్పాలి. ఈ కాన్సెప్ట్ పోస్టర్ చూస్తుంటే, హీరో హీరోయిన్లు ఏదో ప్రమాదంలో ఉన్నట్లు కనిపిస్తోంది, ఈ క్రమంలో రోడ్డు మీద వెళ్తున్నట్టు కనిపిస్తోంది. అగ్నిజ్వాలలు అలా చెలరేగి, అవి కాస్త మేఘాల్లా మారి మెదడు ఆకారంలోకి రావడం చూస్తుంటే.. ఈ సినిమా సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ అనిపిస్తోంది. మెదడుకు మేత పెట్టేలా సినిమా ఉంటుందని అంటున్నారు మేకర్స్. ఇక త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను మేకర్లు ప్రకటించనున్నారని తెలుస్తోంది.