Kamal Haasan launches first look of Kingston: సంగీత దర్శకుడు-నటుడు జివి ప్రకాష్ కుమార్ సహజ నటుడిగా ప్రశంసలు అందుకుకుంటూ విభిన్నమైన, ప్రత్యేకమైన కథలతో ప్రాజెక్ట్‌లను చేస్తున్నారు. ఇప్పుడు కొత్త దర్శకుడు కమల్ ప్రకాష్‌తో కలసి ‘ కింగ్‌స్టన్’ పేరుతో ఓ సినిమా చేస్తున్నారు ప్రకాష్. తాజాగా ఉలగ నాయగన్ కమల్ హాసన్ ఈ సినిమా టైటిల్ లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమా ప్రారంభోత్సవంలో పాల్గొని తొలి షాట్‌కు క్లాప్ కొట్టి షూటింగ్‌ను ప్రారంభించారు. జి.వి.ప్రకాష్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, దివ్య భారతి కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో ‘మెర్కు తొడార్చి మలై’ ఫేమ్ ఆంటోనీ, చేతన్, కుమారవేల్, మలయాళ నటుడు సాబుమోన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. గోకుల్ బినోయ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. ధివేక్ డైలాగ్స్ రాస్తుండగా, శాన్ లోకేష్ ఎడిటింగ్ చేస్తున్న ఈ సినిమా ఒక సీ అడ్వంచరస్ హారర్ కథ.
Bhagavanth Kesari: ‘భగవంత్ కేసరి’లో అసలు బాలయ్యని దాచేశారు?
జీ స్టూడియోస్‌తో కలిసి జి.వి. ప్రకాష్ కుమార్ ప్యారలల్ యూనివర్స్ పిక్చర్స్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు కమల్ ప్రకాష్ మాట్లాడుతూ.. నాలాంటి కొత్త దర్శకుడికి కింగ్‌స్టన్ లాంటి డ్రీమ్ స్క్రిప్ట్ రాసి దర్శకత్వం వహించే అవకాశం రావడం మాములు విషయం కాదని, నా విజన్‌ని నమ్మినందుకు జి వి ప్రకాష్, జీ స్టూడియోస్‌కు కృతజ్ఞతలు అని అన్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ మాట్లాడుతూ ”నిర్మాత కావాలనేది నా చిరకాల కోరిక ని అందుకే ఇప్పటివరకూ సరైన కథ కోసం ఎదురుచూశానని అన్నారు. “కింగ్‌స్టన్” స్క్రిప్ట్ విన్న తర్వాత.. ఇది పిల్లల నుండి పెద్దల వరకు ప్రేక్షకులని మెప్పిస్తుందని నమ్మకం కలిగి వెంటనే ఈ సినిమా నిర్మించాలని నిర్ణయించుకున్నానని అన్నారు.