Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. వెండితెరపై కనిపించి దాదాపు రెండేళ్లు అవుతుంది. పుష్ప తరువాత బన్నీ.. ఇంకో సినిమా చేసింది లేదు. పుష్ప 2 కోసమే బన్నీ కష్టపడుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ నటిస్తోంది. ఇక ఈ చిత్రంపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను ఐకాన్ స్టార్ గా మార్చింది పుష్పనే అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. పుష్పను మించి పుష్ప 2 ఉందనున్నదని బన్నీ బర్త్ డే కు రిలీజ్ చేసిన పోస్టర్ తోనే అర్థమైపోయింది. ఇక ఈ సినిమా గురించి వచ్చిన ఏ చిన్న అప్డేట్ అయినా కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది. పుష్ప 2 సినిమా మొదలైనప్పటినుంచి ఈ చిత్రంలో ఐటెం సాంగ్ ఎవరు చేస్తున్నారు అనేది పెద్ద చర్చగా మారింది. పుష్పలో ఊ అంటావా మావ అంటూ బన్నీతో సమంత ఆడిపాడి అదరగొట్టింది. ఇప్పటికీ టాప్ ట్రెండింగ్ లో ఉంది ఈ సాంగ్ అంటే అతిశయోక్తి కాదు. ఇక పుష్ప 2 లో కూడా సామ్ నే ఐటెం సాంగ్ చేస్తుందని వార్తలు వచ్చాయి అయితే అందులో నిజం లేదని తెలుస్తోంది. ఇక తాజాగా ఒక ఫోటో మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
RGV: ది కేరళ స్టోరీ సినిమాపై వర్మ రివ్యూ.. ఏమన్నాడంటే..?
రన్ రాజా రన్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సీరత్ కపూర్ గుర్తుందిగా.. హా, ఆమెతో కలిసి అల్లు అర్జున్ దిగిన ఫోటో ఒకటి అంతర్జాలంను షేక్ చేస్తోంది. ఈ ఫోటోను సీరత్ పోస్ట్ చేస్తూ.. ” డ్యాన్సర్లు ఎదగడానికి రెక్కలు అవసరం లేదు.. వారు ఎనర్జీస్ వారికి దారి ఇస్తాయి. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు తెలుసు..” అంటూ అల్లు అర్జున్ ను ట్యాగ్ చేసింది. ఇక ఫొటోలో బన్నీకి టైట్ హాగ్ ఇస్తూ నవ్వులు చిందిస్తూ కనిపించింది. ఈ ఫోటో చూసిన అభిమానులు పుష్ప 2 లో సాంగ్ కోసం ప్రాక్టీస్ అనుకుంటా.. అని కొందరు.. పుష్ప 2 లుక్.. ఖచ్చితంగా ఈమెనే ఐటమ్ సాంగ్ చేస్తుంది అనుకుంటా..? అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. ఇక ఇదే కనుక నిజమైతే సీరత్ పంట పండిందనే చెప్పాలి. రన్ రాజా రన్ తరువాత అమ్మడి కి ఒక్క హిట్ కూడా దక్కలేదు.. ఈ సాంగ్ కనుక హిట్ అయితే.. అమ్మడి రేంజ్ మారిపోతుంది. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.
Dancers don’t need wings to fly! Their energies lead. Those who know. Know.
@alluarjun 💕🕺💃 pic.twitter.com/jB04MWTe0a
— Seerat Kapoor (@IamSeeratKapoor) May 8, 2023