సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారువారి పాట’. మే 12 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉన్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో చిత్ర బృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచేసింది. తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేష్ సినిమా గురించి చాలా ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లిన కొద్దిరోజులకే ఈ సినిమా టైటిల్ లో నెట్లో లీకైన విషయం విదితమే.
ఇక విషయమై ఎట్టకేలకు మహేష్ నోరు విప్పాడు. “ఆ రోజున నేను జిమ్ లో ఉన్నాను .. నమ్రత వచ్చి టైటిల్ లీక్ అయిపోయిందని చెప్పింది. అప్పటివరకు నాకూ తెలియదు టైటిల్ ఏంటి అన్నది.. అప్పుడు వెంటనే నేను పరశురామ్ గారికి కాల్ చేసి .. ఏంటి సార్ టైటిల్ అని అడిగాను. అమెరికాలో ఆల్రెడీ టైటిల్ గురించి మాట్లాడేసుకుంటున్నారట .. లీక్ అయిందని అన్నారు. అస్సలు టైటిల్ ఏంటి అని అడగగా ‘సర్కారువారి పాట’ అని చెప్పారు. అదిరిపోయింది .. కానీయండి అన్నాను. కథలో నుంచి వచ్చిన టైటిల్ అది .. వెంటనే కనెక్ట్ అవుతుందని నా ఫీలింగ్. ఇక ఆలస్యం చేయడం కరెక్ట్ కాదని ఆ రోజునే ఎనౌన్స్ చేయడం జరిగిందని”చెప్పారు. అయితే ఇప్పటికీ టైటిల్ ఎలా లీక్ అయ్యింది అనేది తెలియలేదని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.