యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ యొనటించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫెస్టివల్ సీజన్లో బాక్సాఫీస్ వద్ద చెరగని ముద్ర వేసింది. పొంగల్‌కు విడుదలైన ఈ సినిమా అంచనాలను మించి చరిత్రను తిరగరాస్తూ రికార్డులు బద్దలు కొట్టింది. సంక్రాంతికి వస్తున్నాం కేవలం 7 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 203 కోట్లకు పైగా వసూలు చేసింది. కేవలం మొదటి వారంలోనే, ఈ చిత్రం స్మారక ఫీట్‌ని సాధించింది, పండుగ కాలంలో విడుదలైన అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రం ప్రాంతీయ సినిమాగా నిలిచింది. KiranRahay : తండ్రి కాబోతున్న యంగ్ హీరో.. ఫోటో రిలీజ్
Also Read:
అటు ఓవర్సీస్ లోను ఈ చిత్రం దూసుకెళ్తోంది. ఇప్పటికే అక్కడ 2.3 మిలియన్ కే పైగా వసూలు చేసింది మరియు వెంకటేష్, అనిల్ రావిపూడి మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ల హ్యాట్రిక్ కాంబో లో USAలో ఆల్-టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. వినోదాత్మక కథాంశంతో, అనిల్ రావిపూడి యొక్క ట్రేడ్‌మార్క్ వినోదభరితమైన కథనం మరియు వెంకటేష్ యొక్క ఆకర్షణీయమైన నటనతో, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తూ సినిమా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఈ సంక్రాంతికి వస్తున్నాం సునామి ఇప్పట్లో ఆగేలా లేదని రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను బద్దలు కొట్టి ఆర్ ఆర్ ఆర్ వంటి సినిమాల రికార్డులు కూడా బద్దలు కొట్టి ఆల్ టైమ్ హయ్యెస్ట్ వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలుస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా. మరి ఈ వసూళ్ల ప్రవాహం ఎక్కడ ఆగుతుందో చూడాలి.