టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం గతేడాది ఓ ఇంటివాడయిన సంగతి తెలిసిందే. తాను నటించిన మొదటి సినిమా రాజావారు.. రాణివారు కథానాయకి రహస్య గోరఖ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కిరణ్. తాజాగా కిరణ్ అబ్బవరం మరో గుడ్ న్యూస్ చెప్పారు. కిరణ్ అబ్బవరం తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటూ ఈ మంగళవారం ఉదయం తన వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు కిరణ్ అబ్బవరం.
Also Read : Tollywood : బడా నిర్మాతల ఇల్లు, ఆఫీసులో ఐటి అధికారుల దాడులు
అలాగే తన సతీమణి రహస్యతో ఫోటో దిగుతూ బేబీ బంప్ స్పెషల్ పిక్స్ ను రిలీజ్ చేసాడు. ‘మా ప్రేమ పెరుగుతోంది’ అని క్యాప్షన్ ను జత చేస్తూ సంతోషకరమైన మూమెంట్ ను షేర్ చేసుకున్నారు. అందరి ఆశీస్సులు తమకు ఉండాలని కోరుకున్నారు కిరణ్ దంపతులు.ఈ సందర్భంగా కిరణ్ జంట కు విశేష్ తెలుపుతూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత కిరణ్ నటించిన ‘క’ సినిమా గతేడాది దీపావళి కానుకగా విడుదలై కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు తండ్రి కాబోతున్నాడు. వచ్చే నెలలో ఈ యంగ్ హీరో నటించిన దిల్ రుబా రిలీజ్ కు రెడీ గా ఉంది. ఇలా వరుసగా అన్ని గుడ్ న్యూస్ లు వినిపిస్తున్న కిరణ్ కు ,మీరు కూడా శుభాకాంక్షలు చెప్పేయండి.
Our love is growing by 2 feet 👣👼🐣 pic.twitter.com/69gL0sALaZ
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) January 21, 2025