సందీప్ కిషన్ హీరోగా నటించిన ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీ ఊరు పేరు భైరవకోన.. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి విజయాన్ని దక్కించుకుంది.ఫిబ్రవరి 16వ తేదీన ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయింది. వీఐ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. హఠాత్తుగా ఓటీటీలోకి వచ్చిన ఊరు పేరు భైరవకోన అక్కడ కూడా సత్తాచాటుతోంది.ఊరు పేరు భైరవకోన మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి శుక్రవారం (మార్చి 8) సడెన్‍గా వచ్చింది. ముందస్తుగా ప్రకటన లేకుండానే హఠాత్తుగా ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల్లోనే ఈ చిత్రం ఓటీటీలో వచ్చింది.ఊరు పేరు భైరవకోన చిత్రం ప్రైమ్ వీడియో ఓటీటీలోకి సడెన్‍గానే వచ్చినా.. భారీ ఆదరణ దక్కించుకుంటోంది. తెలుగు ఆడియోలో మాత్రమే ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. అయినా.. భారీగా వ్యూస్ వస్తుండటంతో నేషనల్ వైడ్ ట్రెండింగ్‍లో నంబర్ వన్ స్థానానికి ఈ చిత్రం దూసుకొచ్చింది.
తెలుగులో మాత్రమే స్ట్రీమింగ్‍కు వచ్చినా.. 24 గంటల్లోనే ప్రైమ్ వీడియోలో ఇండియా ట్రెండింగ్‍లో ఈ చిత్రం టాప్‍కు చేరింది.ఫ్యాంటసీ థ్రిల్లర్‌గా వచ్చిన ఊరు పేరు భైరవకోనలో హారర్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఈ మూవీని ఆసక్తికరంగా తెరకెక్కించడంతో దర్శకుడు వీఐ ఆనంద్ సక్సెస్ అయ్యాడు.ఈ మూవీ తొలివారంలో మంచి వసూళ్లను సాధించింది. అయితే, ఆ తర్వాత కలెక్షన్స్ కాస్త నెమ్మదించాయి.మొత్తంగా సుమారు ఈ చిత్రానికి రూ.27కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.ఊరు పేరు భైరవకోన సినిమాలో సందీప్ కిషన్ సరసన హర్ష బొల్లమ్మ హీరోయిన్‍గా నటించారు. కావ్య థాపర్, వెన్నెల కిశోర్, వైవా హర్ష, రవిశంకర్, వడివుక్కరసి ముఖ్య పాత్రలలో నటించారు.. భాను భోగవరపు ఈ చిత్రానికి కథ అందించారు. ఈ మూవీకి శేఖర్ చంద్ర సంగీతం అందించగా.. రాజ్ తోట సినిమాటోగ్రఫీ చేశారు. రాజేశ్ దండా, మరియు బాలాజీ గుత్తా ఈ మూవీని నిర్మించారు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ ఈ మూవీని సమర్పించింది.