సముద్ర ఖని.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈయన లేని సినిమా రావడం లేదు అంటే అతిశయోక్తి కాదు. మొన్న ‘ఆర్ఆర్ఆర్’ లో తనదైన శైలిలో ఎమోషన్స్ పండించిన ఈయన ఇక తాజాగా సర్కారువారి పాటలో విలనిజాన్ని రక్తికట్టించారు. ఆ నటనతో మహేష్ బాబునే ఇంప్రెస్స్ చేశాడు. ఇక సముద్ర ఖని నటుడు మాత్రమే కాదు దర్శకుడు కూడా.. ఆయన దర్శకత్వం వహించిన పలు సినిమాలు హిట్ టాక్ ను తెచ్చుకున్నాయి. ఇటీవల ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘వినోదాయ సీతాం’ సినిమాను పవన్ రీమేక్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్న విషయం విదితమే. ఇక తాజాగా ఈ విషయాన్ని ఆయనే కన్ఫర్మ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
‘సర్కారువారి పాట’ ప్రమోషన్స్ లో పాల్గొన్న సముద్ర ఖని మాట్లాడుతూ ” పవన్ కళ్యాణ్ తో సినిమా ఉంది.. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ నడుస్తోంది.. త్వరలోనే మీ అందరికి ఒక గుడ్ న్యూస్ చెప్తాం” అని చెప్పుకొచ్చారు. ఇక దీంతో ఈ రీమేక్ కన్ఫర్మ్ అయ్యినట్లే.. ఇక అంతేకాకుండా పవన్ గురించి ఈ నటుడు చేసిన వ్యాఖ్యలు ఈ సినిమాపై హైప్ ను పెంచుతున్నాయి. పవన్ కు తాను పెద్ద అభిమానిని అని, ఆయన ఫ్యాన్స్ ను నిరాశపరిచేలా మాత్రం సినిమా తీయను అన్నట్లు చెప్పుకొచ్చారు. ఇక దీంతో ఈ చిత్రంపై ఫ్యాన్స్ భారీ అంచనాలను పెట్టేసుకున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ తో పాటు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉన్నది అనేది తెలియాల్సి ఉంది.