Samantha – Raj Nidumoru : స్టార్ హీరోయిన్ సమంత నిత్యం వార్తల్లో ఉంటుంది. ఆమె పెద్దగా సినిమాలు చేయకపోయినా.. ఆమె చేస్తున్న పనులతో తెగ ట్రెండింగ్ అవుతోంది. మనకు తెలిసిందే కదా.. సమంత కొన్ని రోజులుగా బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో తిరుగుతోంది. ఈ జంట నిత్యం ట్రిప్పులు, టూర్లు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ తమ మధ్య ఏముందో బయట పెట్టట్లేదు. తాజాగా వీరిద్దరూ దుబాయ్ లోని ఓ ఫ్యాషన్ షోకు వెళ్లారు. అక్కడ సమంత ఓ వీడియో పోస్టు చేసింది. అందులో ఓ వ్యక్తి చేతిని పట్టుకుని కనిపిస్తోంది. ఆ వీడియో క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. అది చూసిన వారంతా రాజ్ చేయి పట్టుకుందని కామెంట్లు పెడుతున్నారు.
Read Also : Shilpa Shetty : హీరోయిన్ శిల్పాశెట్టి దంపతులకు లుకౌట్ నోటీసులు
ఇలాంటి టైమ్ లో రాజ్ నిడుమోరు భార్య శ్యామలి దే షాకింగ్ పోస్ట్ చేసింది. తెలివి తక్కువగా ప్రవర్తించకండి.. తెలివి తక్కువ పని కూడా తెలివిగా చేయండి అంటూ ఆమె రాసుకొచ్చింది. మరో పోస్టులో నిష్ఫక్షపాతంగా ఉండటం అంటే ఇక్కడ మనం ఏదీ సొంతం చేసుకోవద్దు. అలాగే మనల్ని ఏదీ సొంతం చేసుకోవద్దు అంటూ రాసింది. ఇది చూసిన వారంతా సమంతను దృష్టిలో ఉంచుకునే ఇలాంటి పోస్టు చేసిందేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతోంది. సమంత చివరగా శుభం సినిమాకు ప్రొడ్యూసర్ గా చేసింది. త్వరలోనే నందినిరెడ్డితో ఓ మూవీ చేయబోతున్నట్టు తెలుస్తోంది.
Read Also : Comedian Ramachandra : కమెడియన్ కు పక్షవాతం.. నటుడు కిరణ్ ఆర్థిక సాయం..